డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Daaku Maharaaj OTT release date: డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన ఓటీటీ హక్కులను దాదాపు రూ. 50 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు సమాచారం.

Update: 2025-01-17 15:22 GMT

డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Daaku Maharaaj movie OTT Date: వరుస హిట్లతో దూకుడు మీదున్న నందమూరి బాలకృష్ణ.. తాజాగా డాకు మహారాజ్ మూవీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ అంచనాల మధ్య రిలీజైన డాకు మహారాజు.. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

తాజాగా డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన ఓటీటీ హక్కులను దాదాపు రూ. 50 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు సమాచారం. ఈ సినిమా ఫిబ్రవరి 5 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌కు రానున్నట్టు తెలుస్తోంది.

60 ఏళ్ల వయస్సులో కూడా యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు బాలకృష్ణ. వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమా తర్వాత.. తాజాగా డాకు మహారాజ్ మూవీతో వరుసగా నాల్గో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ నాలుగు రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్బులో ప్రవేశించింది. అంతేకాదు 5 రోజుల్లో రూ.114 కోట్ల గ్రాస్ క్లబ్‌తో పాటు రూ.70 కోట్ల షేర్‌తో బాక్సాఫీస్ వద్ద స్టడీగా కలెక్షన్స్ రాబడుతోంది.

అఖండతో ఫస్ట్ టైమ్ రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్బులోకి ప్రవేశించిన బాలకృష్ణ. ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్ మూవీతో వరుసగా నాలుగు వంద కోట్ల గ్రాస్ క్లబ్బులోకి ప్రవేశించిన హీరోగా రికార్డు క్రియేట్ చేశారు. ఇక బాలకృష్ణ 60 ఏళ్ల వయస్సులో వరుసగా నాలుగు సినిమాలు సక్సెస్ అందుకోవడంతో పాటు నాలుగు సినిమాలు రూ.100 కోట్ల గ్రాస్ అందుకున్న సీనియర్ హీరోగా రికార్డు సృష్టించారు.

టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డాకు మహారాజ్ మూవీ తాజాగా తమిళంలో జనవరి 17న విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. అంతేకాదు మరో వారంలో హిందీలో కూడా రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. మరి ఇతర భాషల్లో ఈ సినిమా ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి.

Tags:    

Similar News