రాంగోపాల్ వర్మ : "లడకీ" (అమ్మాయి) సినిమాపై కోర్టు స్టే

రాంగోపాల్ వర్మ : "లడకీ" (అమ్మాయి) సినిమాపై కోర్టు స్టే

Update: 2022-07-18 05:00 GMT

రాంగోపాల్ వర్మ :'లడకీ" (అమ్మాయి) సినిమాపై కోర్టు స్టే 

Ram Gopal Varma: ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ రూపొందించిన "లడకీ" (అమ్మాయి) సినిమాపై కోర్టు స్టే విధించింది. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో వర్మ నిర్మించిన ఈ సినిమాను నిలుపుదల చేయాలంటూ నిర్మాత కె.శేఖర్ రాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైదరాబాద్ లోని గౌరవ సిటీ సివిల్ కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో "సాఫ్ట్ వేర్ సుధీర్" సినిమాను నిర్మించిన తాను రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఓసినిమాను నిర్మించాలని సంకల్పించానని, ఆ మేరకు ఆయనను కలిశానని శేఖర్ రాజు వెల్లడించారు.

అయితే తన దగ్గర సినిమా కోసం పలు ధపాలుగా లక్షలాది రూపాయలు తీసుకున్న వర్మ ఎప్పటికప్పుడు దాటవేస్తూ, తప్పించుకుంటూ వస్తున్నారని, శేఖర్ రాజు వివరించారు. తన డబ్బులు తిరిగి ఇవ్వకపోగా, సరిగ్గా సమాధానం కూడా చెప్పడంలేదని, దాంతో తన దగ్గర ఉన్న డాక్యూమెంట్స్ తో కోర్టును ఆశ్రయించానని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీన సిటీ సివిల్ కోర్టు 'లడకీ" సినిమాను అన్ని భాషలలో ప్రదర్శనను నిలుపుదల చేస్తూ, ఆర్డర్స్ జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. అలాగే అన్నిరకాల డిజిటల్, ప్లాట్ ఫామ్స్ లో సినిమాను అమ్మడానికి కానీ బదిలీ చేయడానికి, కానీ ప్రదర్శించడానికి వీలులేకుండా తాత్కాలిక నిషేధం విధిస్తూ కోర్టు ఆర్డర్స్ ఇచ్చిందని ఆయన చెప్పారు.





Tags:    

Similar News