Mahesh - Rajamouli: SSMB29 నుంచి తప్పుకున్న స్టార్ హీరో ఎవరు?
Mahesh - Rajamouli: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో SSMB29 ఒకటి. స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో, సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా ఈ ప్రాజెక్ట్ తెరపైకి రానుంది.
Mahesh - Rajamouli: SSMB29 నుంచి తప్పుకున్న స్టార్ హీరో ఎవరు?
Mahesh - Rajamouli: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో SSMB29 ఒకటి. స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో, సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా ఈ ప్రాజెక్ట్ తెరపైకి రానుంది. సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లో ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం మేరకు, చిత్రబృందం విలన్ పాత్ర కోసం స్టార్ హీరో విక్రమ్ను సంప్రదించగా, ఆ పాత్రను ఆయన వినయంగా తిరస్కరించినట్లు టాక్. విలన్ క్యారెక్టర్ కావడంతో విక్రమ్ ఈ ఆఫర్ వద్దనేశాడని సమాచారం.
దీంతో ఆ పాత్ర కోసం మరో స్టార్‌ను ఎంచుకునే పనిలో దర్శకధీరుడు రాజమౌళి బృందం పడింది. తాజా సమాచారం ప్రకారం, ‘సలార్’లో విలన్‌గా మెప్పించిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ పాత్రలో నటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయని సినీ వర్గాల సమాచారం.
ఈ ప్రాజెక్ట్ ఎన్నో నెలల ప్రీ-ప్రొడక్షన్ పనుల తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో సెట్స్‌పైకి వచ్చింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషించనున్నప్పటికీ, అధికారికంగా ప్రకటించలేదు.
అలాగే ఆర్.మాధవన్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటించనున్నట్లు టాలీవుడ్‌లో టాక్. త్వరలో ఆయన సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అటవీ నేపథ్యంలో, ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహసికుడి కథగా రూపొందుతోన్న ఈ సినిమా.. భారతీయ సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చూపించబోతోంది.