Chiranjeevi: 'విశ్వంభర' స్టోరీ లైన్ ఇదే.. దర్శకుడు వశిష్ఠ..
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర’, బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
Chiranjeevi: 'విశ్వంభర' స్టోరీ లైన్ ఇదే.. దర్శకుడు వశిష్ఠ..
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర’, బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా కథ గురించి ఇప్పటి వరకు పలు ఊహాగానాలు వినిపించినా, తాజాగా దర్శకుడు వశిష్ఠ స్వయంగా కథా నేపథ్యాన్ని వెల్లడించారు.
వశిష్ఠ మాట్లాడుతూ.. “మనకు మొత్తం 14 లోకాలు ఉన్నాయి — పైన ఏడూ, కింద ఏడూ. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో యమలోకం, స్వర్గలోకం, పాతాళలోకం వంటి లోకాలను చూస్తూ వచ్చాం. కానీ ‘విశ్వంభర’లో నేను మరింత మెరుగైన స్థాయికి తీసుకెళ్లాను. బ్రహ్మదేవుడు నివసించే సత్యలోకంనే ఈ కథకు కేంద్రబిందువుగా చేశాను,” అని చెప్పారు.
ఈ లోకాల బేస్‌పైనే కథ అల్లబడిందని, చిరంజీవి పాత్ర ఎలా సత్యలోకానికి చేరుకుంటాడు? ఎలా హీరోయిన్‌ను తిరిగి తీసుకురస్తాడు? అనే ఆసక్తికరమైన అంశాల చుట్టూ కథ తిరుగుతుందని వశిష్ఠ వెల్లడించారు.
ఈ చిత్రాన్ని వాస్తవ ప్రపంచాన్ని తలపించేలా భారీ సెట్స్ పైన రూపొందిస్తున్నారు. అంతేకాదు, ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కంపెనీలు ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో, ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని విధంగా మెగా స్టార్‌ను ఒక మైథికల్ అవతారంలో చూడబోతున్నామని దర్శకుడు తెలిపారు.
చిరంజీవికి జోడీగా త్రిష, ఆషికా రంగనాథ్‌లతో పాటు, బాలీవుడ్ నటి మౌనీరాయ్ కూడా ఈ సినిమాలో కనిపించనుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, చిరంజీవి–మౌనీరాయ్ కలిసి ఒక స్పెషల్ సాంగ్‌లో నర్తించనున్నారట. అంతేకాదు, మెగాస్టార్ బ్లాక్‌బస్టర్ *‘ఖైదీ’*లోని ఐకానిక్ సాంగ్ "రగులుతోంది మొగలిపొద…" కు రీమిక్స్ చేస్తూ ఈ జోడీ అలరించనుంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో రానుంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సినిమాకు సంబంధించి వినిపిస్తున్న తాజా అప్‌డేట్స్‌తో మెగా అభిమానులు ఈ చిత్రంపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. భారీ బడ్జెట్, విభిన్న కథ, అత్యుత్తమ టెక్నికల్ విలువలు కలిసొచ్చే ఈ సినిమాను వెండితెరపై చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.