Mega Victory Mass Song: 'ఏంటి బాసూ సంగతి.. అదిరిపోద్ది సంక్రాంతి!'.. చిరు-వెంకీల ‘మెగా విక్టరీ’ సాంగ్ వచ్చేసింది!

Mega Victory Mass Song: సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'మన శంకరవరప్రసాద్‌ గారు' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Update: 2025-12-30 11:45 GMT

Mega Victory Mass Song: 'ఏంటి బాసూ సంగతి.. అదిరిపోద్ది సంక్రాంతి!'.. చిరు-వెంకీల ‘మెగా విక్టరీ’ సాంగ్ వచ్చేసింది!

Mega Victory Mass Song: సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'మన శంకరవరప్రసాద్‌ గారు' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఆర్ యూ రెడీ’ (Mega Victory Mass Song) అంటూ సాగే మాస్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

పాట హైలైట్స్:

ఈ పాటలో చిరంజీవి స్టైల్, వెంకటేష్ టైమింగ్ ఒకే ఫ్రేమ్‌లో చూడటం అభిమానులకు కనువిందుగా ఉంది. వెంకటేష్ ఈ సినిమాలో కీలకమైన అతిథి పాత్రలో మెరవబోతున్నారు. ‘ఏంటి బాసూ సంగతీ.. అదిరిపోద్దీ సంక్రాంతీ.., ఏంటి వెంకీ సంగతీ.. ఇరగతీద్దాం సంక్రాంతీ..’ అంటూ సాగే ఈ పాటను ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ రాశారు. మాస్ ఎలిమెంట్స్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్ చేయడంలో దిట్ట అయిన అనిల్ రావిపూడి, ఈ పాటను వెండితెరపై మరింత కలర్‌ఫుల్‌గా చూపించబోతున్నారు.

సంక్రాంతి రిలీజ్:

సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. చిరంజీవి కెరీర్‌లో ఈ చిత్రం మరో విభిన్నమైన ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ట్రేడ్ వర్గాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారింది.

Full View


Tags:    

Similar News