ఆచార్య లో జరిగిన తప్పులను గుణపాటం గా తీసుకున్న చిరంజీవి

*ఆచార్య తర్వాత "భోళా శంకర్" లో జాగ్రత్తలు తీసుకుంటున్న మెగాస్టార్

Update: 2022-05-11 03:30 GMT

ఆచార్య లో జరిగిన తప్పులను గుణపాటం గా తీసుకున్న చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫలితాన్ని చూశాక చిరంజీవి తన తదుపరి సినిమాల కథలు గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. నిజానికి చిరంజీవి చేతిలో ఇప్పుడు బోలెడు సినిమాలు రెడీగా ఉన్నాయి. కానీ అభిమానులలో మాత్రం ఏదో ఒక తెలియని వెలితి ఉంది.

దానికి కారణం చిరంజీవి చేతిలో ఉన్న దాదాపు అన్ని సినిమాలు రీమేక్ లే. ఆచార్య సినిమా విడుదలైన తర్వాత కూడా అభిమానులు అసలు ఇలాంటి సినిమాని చిరంజీవి ఎలా ఓకే చేశారని షాకయ్యారు. ఇక ప్రస్తుతం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా "భోళా శంకర్".ఆచార్య సినిమాలు సరికొత్త ఎలిమెంట్లు ఏవీ లేవు. చిరంజీవి అదే కమర్షియల్ ఫార్ములాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ సినిమా ఊహించనివిధంగా ఫ్లాప్ అయింది.

ఈ నేపథ్యంలోనే "బోళా శంకర్" సినిమా కథ కూడా "ఆచార్య" లాగా ఉండకుండా కథలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆచార్య లో జరిగిన తప్పులు గుణపాటం గా తీసుకుని అవే "భోళా శంకర్" లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోడానికి ప్రయత్నిస్తున్నారు డైరెక్టర్ మెహర్ రమేష్. మెగా అభిమానులు కూడా ఇకనైనా చిరంజీవి మంచి కథలతో కంటెంట్ ఉండే సినిమాలతో అలరిస్తారని ఆశిస్తున్నారు.

Tags:    

Similar News