చిరంజీవి – బాబీ కాంబోలో కొత్త సినిమా... కాన్సెప్ట్ పోస్టర్ విడుదల
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు వరుసగా గిఫ్టులు అందుతున్నాయి. మన శంకర వరప్రసాద్ గారు, విశ్వంభర సినిమాల నుంచి వచ్చిన కొత్త అప్‌డేట్స్‌తో మురిసిపోతుండగానే, ఇప్పుడు మరో సర్‌ప్రైజ్ అందింది. దర్శకుడు బాబీ కొల్లితో చేస్తున్న చిరంజీవి కొత్త సినిమా నుంచి స్ట్రైకింగ్ కాన్సెప్ట్ పోస్టర్ విడుదలైంది.
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు వరుసగా గిఫ్టులు అందుతున్నాయి. మన శంకర వరప్రసాద్ గారు, విశ్వంభర సినిమాల నుంచి వచ్చిన కొత్త అప్‌డేట్స్‌తో మురిసిపోతుండగానే, ఇప్పుడు మరో సర్‌ప్రైజ్ అందింది. దర్శకుడు బాబీ కొల్లితో చేస్తున్న చిరంజీవి కొత్త సినిమా నుంచి స్ట్రైకింగ్ కాన్సెప్ట్ పోస్టర్ విడుదలైంది. రక్తపు మరకలతో నిండిన బ్లేడ్‌ను చూపించిన ఈ పోస్టర్, హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతోందని సూచిస్తోంది.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో చిరంజీవి ఒక రూత్‌లెస్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. చాలా కాలంగా చిరంజీవిని అలాంటి పాత్రలో చూడాలనే అభిమానుల కోరిక నెరవేరబోతోందని భావిస్తున్నారు. వాల్టెయిర్ వీరయ్య బ్లాక్‌బస్టర్ తర్వాత చిరు–బాబీ కాంబోలో వస్తున్న ఇది రెండో సినిమా.
2023 సంక్రాంతికి విడుదలైన వాల్టెయిర్ వీరయ్య భారీ విజయాన్ని సాధించి, మళ్లీ మెగాస్టార్ బాక్సాఫీస్ స్టామినాను నిరూపించింది.
థలపతి విజయ్ జన నాయకన్, యష్ టాక్సిక్ వంటి భారీ చిత్రాలను నిర్మించిన సాండల్‌వుడ్ ప్రొడక్షన్ హౌస్ KVN ప్రొడక్షన్స్, ఇప్పుడు చిరంజీవి – బాబీ కాంబోతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.