Surekha Sikri: స్వర్గస్థురాలైన "చిన్నారి పెళ్లి కూతురు" బామ్మ

Update: 2021-07-16 06:57 GMT

సురేఖ సిక్రీ (ఫైల్ ఫోటో)

Surekha Sikri: 1978లో "కిస్సా కుర్సీ కా" సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సురేఖ సిక్రీ...బుల్లితెరపై చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లో బామ్మగా ఎంతో మంది తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే గురువారం ఉదయం సీనియర్ నటి సురేఖ సిక్రీ గుండెపోటుతో మృతి చెందింది. 1945 ఏప్రిల్ 15 న న్యూఢిల్లీలో జన్మించిన సురేఖ సిక్రీ తన కెరీర్లో వివిధ రకాల పాత్రలను పోషించి నటిగా మంచి గుర్తింపు పొందింది. దాదాపుగా ఎనిమిదేళ్ళు ప్రసారం అయిన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లో మొదటి నుండి ఉన్న ఈ బామ్మ ఆ సీరియల్ పూర్తయ్యే సరికి తన రెమ్యునరేషన్ మూడు రెట్లు పెంచింది. సుమారుగా 20 కి పైగా చిత్రాల్లో నటించిన సురేఖ సిక్రీ 10 కి పైగా సీరియల్స్ కూడా నటించింది.

ఇక సహాయనటిగా నేషనల్ అవార్డుతో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డులు సాధించిన సురేఖ సిక్రీ తను నటించిన హిందీలో "బాలిక వధు", తెలుగులో చిన్నారి పెళ్లి కూతురితో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న సురేఖ సిక్రీ ఆ మధ్య నేషనల్ అవార్డుని అందుకోడానికి వచ్చిన సురేఖ సిక్రీ అచేతన పరిస్థితిని చూసి పలువురు తమ బాధని వ్యక్తం చేశారు. మరోపక్క రైటర్ గా కూడా ప్రతిభ ఉన్న సురేఖ సిక్రీ రైటర్ గా కాకుండా తను జీవించినంత కాలం నటనలో ఉంటానని ఒక సందర్భంలో తెలిపింది. 2009 అక్టోబర్ లో 20 తన భర్త హేమంత్ రేగే కూడా గుండెపోటుతో మరణించాడు.

Tags:    

Similar News