సుప్రీతా హీరోయిన్‌గా తొలి సినిమా.. ఆకట్టుకుంటోన్న "చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి" టైటిల్ గ్లింప్స్
Chaudhary Gari Abbayi Tho Naidu Gari Ammayi: ఎమ్3 మీడియా పతాకంపై, మహా మూవీస్ సౌజన్యంతో రూపొందుతున్న చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి చిత్రం టైటిల్ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. బిగ్‌బాస్ ఫేమ్ అమరదీప్ చౌదరి హీరోగా, నటి సురేఖ వాణి కుమార్తె సుప్రీతా నాయుడు హీరోయిన్‌గా నటిస్తున్నారు.
సుప్రీతా హీరోయిన్‌గా తొలి సినిమా.. ఆకట్టుకుంటోన్న "చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి" టైటిల్ గ్లింప్స్
ఎమ్3 మీడియా పతాకంపై, మహా మూవీస్ సౌజన్యంతో రూపొందుతున్న చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి చిత్రం టైటిల్ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. బిగ్‌బాస్ ఫేమ్ అమరదీప్ చౌదరి హీరోగా, నటి సురేఖ వాణి కుమార్తె సుప్రీతా నాయుడు హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాల్యాద్రి రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ సందర్బంగా నిర్మాత మహేంద్ర నాథ్ మాట్లాడుతూ "ప్రారంభంలో మా ప్రాజెక్ట్ చిన్న స్థాయిలో మొదలుపెట్టాం. కానీ, హీరో-హీరోయిన్‌లకు ఉన్న క్రేజ్ వల్ల సినిమా మీద అంచనాలు పెరిగాయి. రాశి, వినోద్ కుమార్, సురేఖ వాణి, రాజా రవీంద్ర లాంటి అనుభవజ్ఞులతో సినిమా మరింత బలపడింది. షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ‘చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి’ అనే ప్రత్యేకమైన టైటిల్‌తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం” అని తెలిపారు.
హీరోయిన్ సుప్రీతా నాయుడు మాట్లాడుతూ..“మొదటిసారి కెమెరా ముందుకు వచ్చేటప్పుడు భయంగా అనిపించింది. కానీ డైరెక్టర్ గారి గైడెన్స్, అమరదీప్ గారి సపోర్ట్ వల్ల కాన్ఫిడెన్స్ వచ్చింది. మా నిర్మాత గారు నన్ను ఇంటి అమ్మాయిలా చూసుకున్నారు. ఈరోజు రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్ అద్భుత విజువల్స్ తో ఉన్నాయి” అని చెప్పింది.
కాగా సురేఖ వాణి మాట్లాడుతూ.. "టైటిల్ బాగా నచ్చింది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను" అని అన్నారు. హీరో అమరదీప్ చౌదరి మాట్లాడుతూ.. ఇది నా తొలి సినిమా. ఇంత అర్థవంతమైన టైటిల్‌తో రావడం సంతోషంగా ఉంది. మహేంద్ర గారు లాంటి ప్రొడ్యూసర్‌తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. బిగ్‌బాస్ తర్వాత సినిమా ఆలస్యం అయ్యిందని చాలామంది అడిగారు. కానీ మనకు నచ్చే కంటెంట్‌తో, ప్లానింగ్‌తో మంచి సినిమాను అందించాలనే ఉద్దేశంతో తీసుకున్న సమయం ఇది. సినిమా బాగా వచ్చింది. తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చుతుందని నమ్మకం ఉంది” అని వివరించారు.