Green Signal For Film Shootings : సినిమా షూటింగ్‌లకు కేంద్రం ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ !

Green Signal For Film Shootings : కరోనా నేపధ్యంలో లాక్ డౌన్ ను విధించిన కేంద్ర ప్రభుత్వం క్రమక్రమంగా సడలింపులు ఇస్తుంది.. అందులో భాగంగా తాజాగా

Update: 2020-08-23 07:39 GMT

film shooting

Green Signal For Film Shootings : కరోనా నేపధ్యంలో లాక్ డౌన్ ను విధించిన కేంద్ర ప్రభుత్వం క్రమక్రమంగా సడలింపులు ఇస్తుంది.. అందులో భాగంగా తాజాగా దేశవ్యాప్తంగా సినిమాలు, టీవీ సీరియల్స్ షూటింగ్ లకు అనుమతి ఇచ్చింది. కరోనా నిబంధనలకి లోబడి షూటింగ్ లను నిర్వహించుకోవాలని వెల్లడించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న అన్‌లాక్‌-3 ఆగస్టు 31తో ముగియనున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అనుమతులను జారీ చేసింది. మొట్టమొదటి లాక్‌డౌన్‌ విధించిన మార్చి 25వ తేదీ నుంచి ఎక్కడి షూటింగ్‌లు అక్కడే నిలిచిపోయాయి.

నిబంధనలు ఇలా ఉన్నాయి..

* బహిరంగ ప్రదేశాల్లో యూనిట్ సిబ్బంది మొత్తం కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి.

* చిత్రీకరణ ప్రదేశంలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి.

* సినిమా షూటింగ్ సమయంలో విజిటర్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దు.

* సాధ్యమైనంత వరకు తక్కువ సిబ్బందితో సినిమా షూటింగ్ లను చేసుకోవాలి.

* మేకప్ సిబ్బంది కచ్చితంగా PPE కిట్లు ధరించాలి.

* షూటింగ్ జరిపే ప్రాంతాల్లో తాత్కాలిక ఇసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేసుకోవాలి.

* షూటింగ్ లో పాల్గొనే సిబ్బంది కచ్చితంగా ఆరోగ్య సేతు యాపని ఉపయోగించాలి.

* షూటింగ్‌ పాయింట్‌ వద్ద సిబ్బంది థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరిగా చేయాలి.  

Tags:    

Similar News