Sushant Singh Rajput case: రియాకి సీబీఐ ప్రశ్నల వర్షం..
Sushant Singh Rajput case: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో సీబీఐ జోరు పెంచింది.. ఇప్పటికే సుశాంత్ ఫ్రెండ్ సిద్ధార్థ్ పితానీ
CBI Questioned to Rhea Chakraborty in Sushant Rajput Death Case
Sushant Singh Rajput case: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో సీబీఐ జోరు పెంచింది.. ఇప్పటికే సుశాంత్ ఫ్రెండ్ సిద్ధార్థ్ పితానీ, ఇంటి పనిమనిషిని విచారించిన సీబీఐ తాజాగా ఈ రోజు (శుక్రవారం) సుశాంత్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిని సీబీఐ విచారణకి పిలిపించింది. ఈ విచారణలో భాగంగా సీబీఐ రియాని పలు ప్రశ్నలను సంధించింది. ముంబైలోని డీఆర్‌డీఓ గెస్ట్ హౌజ్‌లో ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ఈ విచారణ కొనసాగుతోంది. దాదాపు గంటన్నరకి పైగా సీబీఐ అధికారులు రియాను విచారించారు.. ఈ విచారణలో భాగంగా ఆమె నుంచి సరైనా సమాధానాలు రాబట్టినట్టుగా సమాచారం..
'సుశాంత్ మీకు ఎలా పరిచయం.. ఆ పరిచయం ఎంత వరకు వెళ్లింది. సుశాంత్‌ను పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? చివరి సారిగా అతనితో మాట్లాడింది ఎప్పుడూ..అతని బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు ఎవరి ఖాతాలకు వెళ్లింది. వంటి ప్రశ్నలను సీబీఐ అధికారులు రియాను అడిగినట్టుగా సమాచారం.. సుశాంత్ ది ఆత్మహత్యా లేదా హత్య అన్న కోణంలో సీబీఐ తమ దర్యాప్తును కొనసాగిస్తుంది..
సుశాంత్ తండ్రి ఆరోపణలు :
రియా చక్రవర్తి పైన సుశాంత్ తండ్రి కేకే సింగ్ పలు ఆరోపణలు చేశారు.. తాజాగా ఓ వీడియోలో మాట్లాడిన అయన రియా చక్రవర్తి తన కుమారుడిని చంపిన హంతకురాలని అంటూ కామెంట్స్ చేశారు.. చాలా రోజులుగా రియా చక్రవర్తి నా బిడ్డకు విషం ఇచ్చిందని, ఆమె ఒక హంతకురాలని, ఆమెను, ఆమె అనుచరులను వెంటనే అరెస్టు చేయాలి' ఆయన డిమాండ్ చేశారు. సుశాంత్ బ్యాంకు ఖాతాల నుంచి రూ.15 కోట్ల నగదు నటి రియా చక్రవర్తి ఖాతాలోకి బదిలీ అయినట్లుగా సుశాంత్ తండ్రి గతంలో ఆరోపించారు