Salman Khan: బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు పాముకాటు
Salman Khan: *ముంబైలోని ఫామ్‌హౌస్‌లో సల్మాన్‌ను కాటేసిన పాము *హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
Salman Khan: బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు పాముకాటు
Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ప్రమాదం తప్పింది. ముంబైకి సమీపంలోని తన ఫామ్‌హౌస్‌లో గడిపేందుకు వెళ్లగా.. ఆదివారం తెల్లవారుజామున ఓ పాము.. సల్మాన్ ఖాన్ కుడి చేతిపై కాటేసింది. హుటాహుటిన సల్మాన్‌ను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. సల్మాన్‌కు అయిన గాయాన్ని పరిశీలించిన వైద్యులు.. కాటేసింది విష సర్పం కాదని తెలిపారు. పాము కాటుకు విరుగుడు చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.