Raj Kundra: కీచక కుంద్రా.. అడల్ట్ పిక్చర్స్‌ కోసం మోడల్సే టార్గెట్‌

Raj Kundra: అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు * పోర్న్ వీడియోలను చిత్రీకరించి యాప్స్‌లో ప్రసారం చేస్తున్నాడని ఆరోపణ

Update: 2021-07-20 01:26 GMT
శిల్ప శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ (ఫైల్ ఇమేజ్)

Raj Kundra Arrest News: అవకాశాలు ఇప్పిస్తా అన్నాడు.. రంగుల ప్రపంచానికి రాణివి నువ్వే అని మాటిచ్చాడు.. మోడల్సే టార్గెట్‌గా వెబ్ సిరీస్‌ అవకాశాల పేరుతో అడల్ట్ పిక్చర్స్‌ తీస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఇదంతా చేసింది ఏ థర్డ్‌ పార్టీ అనామకుడోకాదు ఇండియన్ బెస్ట్ జోడిగా పేరొందిన బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రానే. ప్రస్తుతం ఈ పోర్నోగ్రఫీ ఎపిసోడ్ బయటపడడంతో నిన్న అర్థరాత్రి ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం బాలీవుడ్‌తోపాటు యావత్ దేశాన్ని షేక్ చేస్తోంది.

రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్‌ కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వెబ్‌ సిరీస్‌ల పేరుతో పోర్న్‌, సెమీ పోర్న్‌ కంటెంట్‌ను తీయడంతో పాటు వాటిని కొన్ని యాప్‌ల ద్వారా జనాల్లోకి తీసుకెళ్తున్నాడంటూ రాజ్ కుంద్రాపై అభియోగాలు నమోదు అయ్యాయి. దీంతో నిన్ననే విచారణ పేరిట బైకుల్లాలోని తమ ఆఫీస్‌కు రప్పించుకున్న ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అటు నుంచి అటే కుంద్రాను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు ఈ మొత్తం పోర్న్‌ మాఫియాకు రాజ్‌ కుంద్రానే సూత్రధారి అని ముంబై పోలీస్‌ కమిషనర్‌ నిర్ధారించారు. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్‌కి గురైంది.

Tags:    

Similar News