తన తల్లి పేరు మీద సోనూసూద్ స్కాలర్ షిప్ లు

Sonu Sood Scholarship For IAS Aspirants : లాక్ డౌన్ సమయంలో వలసకూలీల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట సోనూసూద్‌ దేవుడుగా నిలిచాడు..

Update: 2020-10-13 10:57 GMT

sonusood

Sonu Sood Scholarship For IAS Aspirants : లాక్ డౌన్ సమయంలో వలసకూలీల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట సోనూసూద్‌ దేవుడుగా నిలిచాడు.. అంతటితో తన సేవలను ఆపడం లేదు.. కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు. చిన్న పిల్లలకు ఉచిత విద్య మరియు వైద్య సదుపాయాలను కూడా అందిస్తున్నాడు.. ఇలా సమస్య కనిపిస్తే చాలు సొల్యూషన్ లాగా మారిపోతున్నాడు. దీనితో ఇప్పుడు ఎక్కడ చూసిన సోనూసూద్ పేరే వినిపిస్తోంది. సోనుసూద్ సేవలకి గాను ఇటివల ఐక్యరాజ్యసమితి (యుఎన్‌డిపి) ఎస్‌డిజి స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డుతో సత్కరించింది.

ఇలా హెల్పింగ్ స్టార్ గా గుర్తింపు పొందిన సోనూసూద్ తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన తల్లి ప్రొఫెసర్ సరోజ్ సూద్ 13 వ వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్ధంగా ఆమె పేరు మీదుగా స్కాలర్ షిప్ లు ఇస్తున్నట్టుగా సోనూసూద్ ప్రకటించాడు. పేదరికంలో ఉండి ఐఎఎస్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులు తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం ఈ సహాయం చేస్తునట్టుగా సోనూసూద్ వెల్లడించాడు. ఇక స్కాలర్ షిప్ ల కోసం www.schollifeme.com సైట్ లో అప్లయ్ చేసుకోవాలని సోనూసూద్ సూచించాడు. సోనూసూద్ చేస్తున్న ఈ గొప్ప సహాయానికి నెటిజన్లు సోనూని 'నిజమైన హీరో' అని మరోసారి అభినందిస్తున్నారు. 




 


Tags:    

Similar News