ముంబైలో పవర్‌ కట్‌ : సోనూ ట్వీట్‌.. నెటిజన్లు ఫిదా!

ముంబైలో  పవర్‌ కట్‌ : సోనూ ట్వీట్‌.. నెటిజన్లు ఫిదా!
x
Highlights

Mumbai Power Cut : దేశావాణిజ్య రాజధాని ముంబైలో నిన్న(సోమవారం) కొన్ని గంటల పాటు పవర్‌ కట్‌ అయింది. గ్రిడ్ ఫెయిల్యూర్ స‌మ‌స్య వ‌ల‌న ముంబై అంత‌టా విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది.

Mumbai Power Cut : దేశావాణిజ్య రాజధాని ముంబైలో నిన్న(సోమవారం) కొన్ని గంటల పాటు పవర్‌ కట్‌ అయింది. గ్రిడ్ ఫెయిల్యూర్ స‌మ‌స్య వ‌ల‌న ముంబై అంత‌టా విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. ఈ క్రమంలో న‌గ‌ర ప్రజ‌లు విద్యుత్ స‌మ‌స్యపైన ట్విట్టర్ వేదికగా పలు ట్వీట్లు చేస్తూ వచ్చారు. దీనితో #Mumbaielectricity ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో బాలీవుడ్ నటీనటులు అమితాబ్‌ బచ్చన్‌, నిమ్రత్‌ కౌర్‌, అలీ ఫాజల్‌ ముంబై ప్రజలను ఉద్దేశిస్తూ పలు ట్వీట్లు చేశారు. అందులో భాగంగానే హెల్పింగ్ స్టార్ సోనూసూద్‌ చేసిన ఓ ట్వీట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఫిదా చేసింది.

ఇంతకి సోనూసూద్‌ ఏమని ట్వీట్ చేశాడంటే.. 'ముంబయిలో రెండు గంటలపాటు విద్యుత్‌ లేదని మొత్తం దేశానికి తెలిసిపోయింది. కానీ ఇవాళ్టికి కూడా దేశంలోని అనేక ఇళ్లకు కనీసం రెండు గంటలు కూడా విద్యుత్‌ సరఫరా కావడం లేదు. కాబట్టి దయచేసి ఓపికతో ఉండండి' అంటూ సోనూసూద్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కి నెటిజన్లు సోనూని అభినందిస్తున్నారు. సోనూ ఆలోచించిన తీరు అద్భుతం అంటూ కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.


అటు లాక్ డౌన్ సమయంలో వలసకూలీల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట సోనూసూద్‌ దేవుడుగా నిలిచాడు.. అంతటితో తన సేవలను ఆపడం లేదు.. కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు. చిన్న పిల్లలకు ఉచిత విద్య మరియు వైద్య సదుపాయాలను కూడా అందిస్తున్నాడు.. ఇలా సమస్య కనిపిస్తే చాలు సొల్యూషన్ లాగా మారిపోతున్నాడు. దీనితో ఇప్పుడు ఎక్కడ చూసిన సోనూసూద్ పేరే వినిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories