తల్లి అంత్యక్రియలకు దూరంగా హీరో.. కన్నీరుమున్నీరు

కరోనా మానవ సంబంధాలను ప్రభావితం చేస్తుంది. మహారాష్ట్రలో కరోనా ఎంత వేగంగా విస్తరిస్తోందో తెలిసిందే.

Update: 2020-04-26 13:57 GMT
Irfan Khan (File Photo)

కరోనా మానవ సంబంధాలను ప్రభావితం చేస్తుంది. మహారాష్ట్రలో కరోనా ఎంత వేగంగా విస్తరిస్తోందో తెలిసిందే. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలంతా ఎక్కడివారు అక్కడే వున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ ముంబయిలో చిక్కుకుపోయారు. శనివారం ఇర్ఫాన్‌ ఖాన్‌ తల్లి సయీదా బేగం(95) అనారోగ్యంతో కన్నుమూశారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆమె తుదిశ్వాస విడిచారు.

లాక్ డౌన్ కారణంగా ముంబైలో ఉండడంతో ఇర్ఫాన్ ఖాన్ తన తల్లి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. జైపూర్‌లోని శ్మశానవాటికలో అతితక్కువ మంది కుటుంబసభ్యుల సమక్షంలో అంత్యక్రియలు పూర్తిచేశారు. సయీదా బేగం మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

గత కొంతకాలంగా తన తల్లి అనారోగ్యంతో బాధపడుతోందని, దీంతో పరిస్థితి విషమించి మృతిచెందారని ఇర్ఫాన్‌ సోదరుడు సల్మాన్‌ చెప్పారు. 2018 మేలో ఇర్ఫాన్‌ ఖాన్ క్యాన్సర్‌ బారిన పడిన విషయం తెలిసిందే. లండన్‌లో చికిత్స తీసుకున్న ఆయన ఇటీవల భారత్‌ చేరుకున్నారు.లండన్‌లోని ఆస్పత్రిలో చికిత్స తీసుకోని ఇటీవల భారత్‌ చేరుకున్నారు. ఇర్ఫాన్‌ ఆరోగ్యం గురించి ఈ మధ్యే ఆమె ఫోన్‌ చేసి తెలుసుకున్నారని చెప్పారు. ఇటీవలే ఇర్ఫాన్ ఖాన్ నటించిన 'అంగ్రేజి మీడియం' మార్చి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లాక్‌డౌన్‌ రావడంతో బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. 


Tags:    

Similar News