నటుడు, ఎంపీ రవికిషన్ కు వై ప్లస్ సెక్యురిటీ!
BJP MP Ravi Kishan : బాలీవుడ్ ని డ్రగ్స్ కోణం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఇదే అంశం పైన నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ లోక్ సభలో మాట్లాడారు..
MP Ravi Kishan
BJP MP Ravi Kishan : బాలీవుడ్ ని డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఇదే అంశం పైన నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ లోక్ సభలో మాట్లాడారు.. ఈ క్రమంలో తనకి ప్రాణహాని ఉందని, తనకి భద్రత కల్పించాలని అయన యూపీ ప్రభుత్వాన్ని కోరారు. అయన కోరిక మేరకు తాజాగా భద్రతను కల్పించింది ప్రభుత్వం.. ఈ మేరకు ఆయన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ హిందీలో ట్వీట్ చేశారు.
" నా భద్రతను దృష్టిలో ఉంచుకుని మీరు నాకు Y + కేటగిరీ రక్షణను కల్పించారు. దీనికి నా కుటుంబం మరియు నా లోక్ సభ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు మీకు రుణపడి ఉంటారు. దానికి మేము మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ప్రజా సమస్యలపై సభలో ఎప్పుడూ తన గళం గొంతు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది" అని రవికిషన్ ట్వీట్ చేశారు. ఇక ప్రస్తుతం రవికిషన్ యూపీలోని గోరఖ్‌పూర్ లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇటీవల ముగిసిన పార్లమెంటు రుతుపవనాల సమావేశంలో ఎంపీ రవికిషన్.. బాలీవుడ్‌లో మాదకద్రవ్య అంశాలను అనే అంశాన్ని లేవనెత్తారు. డ్రగ్స్ వ్యసనం చిత్రపరిశ్రమలో కూడా ఉందని, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా యువతను భ్రష్టుపట్టించే కుట్రలో భాగంగా పాకిస్తాన్, చైనా భారత్‌లోకి డ్రగ్స్ అక్రమంగా రవాణా చేస్తున్నాయని ఈ భోజ్‌పురి నటుడు అన్నారు. ఇక ఈ కేసులో ఎన్‌సిబి చాలా బాగా పని చేస్తోందని, నిందితులను త్వరలోనే పట్టుకోవాలని, వారికి తగిన శిక్షను అములు చేయాలనీ ఆయన అన్నారు. అయితే అయన వాఖ్యాలను ఎంపీ జయా బచ్చన్ తప్పుబట్టారు.