Bimbisara: ప్రమోషన్ పనులు మొదలుపెట్టిన "బింబిసార" బృందం

Bimbisara: టీజర్ మరియు ట్రైలర్ లాంచ్ చేయబోతున్న "బింబిసార" బృందం

Update: 2021-11-22 15:14 GMT

ప్రమోషన్ పనులు మొదలుపెట్టిన "బింబిసార" బృందం (ఫైల్ ఇమేజ్)

Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా తన ఆశలన్నీ "బింబిసార" సినిమాపైనే పెట్టుకున్నారు. ఒక క్రూరమైన రాజు కథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ పీరియడ్ డ్రామా లో క్యాథరిన్ తెరిసా మరియు సంయుక్త మీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మంచి అంచనాల మధ్య ఈ సినిమా డిసెంబర్ లో విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే దర్శక నిర్మాతలు చిత్ర ప్రమోషన్స్ పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ చిత్ర దర్శక నిర్మాతలు సినిమా టీజర్ మరియు ట్రైలర్ ని త్వరలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర టీజర్ గడువు ఒక్క నిమిషం 7 సెకండ్లు ఉండబోతుందట. అలాగే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ నిడివి రెండు నిముషాల 39 సెకండ్లు అని తెలుస్తోంది. మల్లిడి వశిష్ఠ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాని కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 24 న థియేటర్లలో విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News