Biggboss 9 : బిగ్ బాస్ ఇంట్లో గొడవలు, రచ్చ రచ్చ..కెప్టెన్‌గా సామాన్యుడు
బిగ్ బాస్ ఇంట్లో రెండో వారపు కెప్టెన్సీ టాస్క్ గట్టిగానే జరిగింది. కెప్టెన్సీ కోసం సెలెక్టైన కంటెండర్ల మధ్య పెద్ద గొడవలకు దారి తీసింది. ఆటతో పాటు వ్యక్తిగత దూషణలు, గొడవలు ఇంట్లో రచ్చ సృష్టించాయి. ఈ వారం కెప్టెన్ ఎవరు? గొడవలకు కారణం ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Biggboss 9 : బిగ్ బాస్ ఇంట్లో గొడవలు, రచ్చ రచ్చ..కెప్టెన్‌గా సామాన్యుడు
Biggboss 9 : బిగ్ బాస్ ఇంట్లో రెండో వారపు కెప్టెన్సీ టాస్క్ గట్టిగానే జరిగింది. కెప్టెన్సీ కోసం సెలెక్టైన కంటెండర్ల మధ్య పెద్ద గొడవలకు దారి తీసింది. ఆటతో పాటు వ్యక్తిగత దూషణలు, గొడవలు ఇంట్లో రచ్చ సృష్టించాయి. ఈ వారం కెప్టెన్ ఎవరు? గొడవలకు కారణం ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ బజ్జర్.. నో బజ్జర్ అనే ఆటను ఇచ్చారు. హౌస్‌మేట్స్‌ను రెండు టీమ్‌లుగా విభజించారు.. ఓనర్స్, టెనెంట్స్. రెండు టీమ్‌లకు ఒక ఫోన్ ఇచ్చి, బజ్జర్ నొక్కడం లేదా నొక్కకపోవడం ఆధారంగా టైమర్‌ను పెంచడం లేదా తగ్గించడం జరిగుతుంది అని చెప్పారు. ఒక టీమ్ మాత్రమే బజ్జర్ నొక్కితే ఆ టీమ్ టైమర్ సున్నా అవుతుంది. ఈ టాస్క్‌లో రెండు టీమ్‌లు ఒకేసారి బజ్జర్ నొక్కినప్పటికీ, చివరికి ఓనర్స్ టీమ్ టైమర్ సున్నాకు చేరుకోవడంతో ఆ జట్టు విజయం సాధించింది.
ఓనర్స్ జట్టు గెలిచిన తరువాత, కెప్టెన్సీ కంటెండర్స్ ఎంపిక ప్రక్రియ మొదలయింది. టెనెంట్స్ జట్టు గెలిచిన ఓనర్స్ టీమ్ నుంచి ముగ్గురిని ఎంపిక చేయాల్సి వచ్చింది. దీనితో భరణి, మనీష్, పవన్లను కెప్టెన్సీ కంటెండర్లుగా టెనెంట్స్ సెలక్ట్ చేశారు. ఆ తర్వాత, ఆ ముగ్గురు ఓనర్లు టెనెంట్స్ జట్టు నుంచి ఒక కంటెస్టెంట్‌ను ఎంపిక చేయాల్సి ఉండగా, వారు ఇమాన్యుయేల్ ను ఎంపిక చేశారు. అయితే ఈ ప్రక్రియలో హౌస్‌మేట్స్ మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి.
కెప్టెన్సీ టాస్క్ జరుగుతుండగా, కెప్టెన్ సంజన, రీతూ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సంజన కోపంలో రీతూ మీద చేయి చేసుకోవడంతో ప్రియా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు సంజనకు శిక్ష విధించాలని ప్రియా పట్టుబట్టింది. మేనేజర్ అయిన మనీష్ కూడా సంజనను స్విమ్మింగ్ పూల్‌లోకి దూకమని శిక్ష విధించాడు. కానీ సంజన దానికి ఒప్పుకోలేదు. దీనితో ప్రియా, మనీష్ కలిసి బలవంతంగా ఆమెపై నీళ్లు పోయాలని ప్రయత్నించారు.
కెప్టెన్సీ టాస్క్‌లో ఎంపికైన భరణి, మనీష్, పవన్, ఇమ్మాన్యుయేల్ ఒక కలరింగ్ గేమ్‌లో పాల్గొన్నారు. టీ-షర్ట్‌పై ఎక్కువ రంగు ఉంటే అవుట్ అని బిగ్ బాస్ చెప్పారు. ఈ ఆటలో రీతూ హోస్టుగా వ్యవహరించింది. మొదటి లెవెల్‌లో మనీష్ అవుట్ అయ్యాడు. రెండో లెవెల్‌లో భరణిని ఆపమని చెప్పినా వినకపోవడంతో అతడిని కూడా అవుట్ చేశారు. చివరికి, పవన్ ఈ గేమ్‌లో గెలిచి రెండో వారానికి కెప్టెన్ అయ్యాడు. పవన్ విజయాన్ని ప్రియా, శ్రీజ సంబరాలు చేసుకున్నారు.
ఈ కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్న సమయంలో ప్రియా, శ్రీజ గ్రూప్ గేమ్స్‌పై ఆరోపణలు చేశారు. వారు మనీష్, పవన్, భరణి, ఇమ్మాన్యుయేల్ ఒక గ్రూప్‌గా కలిసి ఆడుతున్నారని, ఇది కామనర్ వర్సెస్ సెలబ్రిటీస్ గేమ్ అని విమర్శించారు. పవన్ కెప్టెన్‌గా ఎలా వ్యవహరిస్తాడో చూడాలి.