Bigg Boss 9: ఫుడ్ కోసం ఫైట్.. మాధురి-తనూజల కోపాలు, కన్నీళ్లు.. మధ్యలో భరణి ఎమోషన్!
కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో రోజురోజుకూ డ్రామా, ఎమోషన్స్ పెరుగుతున్నాయి. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌లు భరణి, శ్రీజ రీ-ఎంట్రీ ఇవ్వడంతో హౌస్ డైనమిక్స్ పూర్తిగా మారిపోయాయి.
Bigg Boss 9: ఫుడ్ కోసం ఫైట్.. మాధురి-తనూజల కోపాలు, కన్నీళ్లు.. మధ్యలో భరణి ఎమోషన్!
Bigg Boss 9: కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో రోజురోజుకూ డ్రామా, ఎమోషన్స్ పెరుగుతున్నాయి. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌లు భరణి, శ్రీజ రీ-ఎంట్రీ ఇవ్వడంతో హౌస్ డైనమిక్స్ పూర్తిగా మారిపోయాయి. గురువారం ప్రసారమైన 54వ ఎపిసోడ్ ముఖ్యంగా భరణి-శ్రీజల భవితవ్యాన్ని నిర్ణయించే టాస్క్‌ల చుట్టూ, అలాగే మాధురి-తనూజల మధ్య ఫుడ్ విషయంలో తలెత్తిన ఉద్విగ్న గొడవ చుట్టూ తిరిగింది. ఉద్రిక్తతలు, భావోద్వేగాలు, టాస్క్ బ్యాటిల్స్‌తో హౌస్ మొత్తం హీటెక్కింది.
54వ రోజు ఎపిసోడ్ ఉదయం నుంచే వంట గది వివాదంతో మొదలైంది. తనూజ, మాధురి మధ్య ఫుడ్ క్వాంటిటీ గురించి చిన్న మాటలు మొదలై పెద్ద గొడవగా మారాయి. "నాకు తిండి తక్కువ అవుతోంది. నువ్వు చపాతీ ఎక్కువ పెట్టుకున్నావు" అంటూ తనూజ చేసిన వ్యాఖ్యలపై మాధురి తీవ్రంగా మనస్తాపం చెందింది. "నేను ఫుడ్ కోసం చస్తున్నాను అని మా వాళ్లకు తెలిస్తే బాధపడతారు" అంటూ మాధురి కన్నీళ్లు పెట్టుకుంది. ఆ కోపంతో ఆమె ఆహారం తినడానికి నిరాకరించింది.
ఈ విషయంపై భరణి ఎమోషనల్‌గా స్పందిస్తూ.. "అందరూ తింటూ ఆమె మాత్రం తినకుంటే నాకు బాధగా ఉంది. దయచేసి ఆమెని తినమని చెప్పండి" అని హౌస్‌మేట్స్‌ను కోరాడు. అయితే, ఎపిసోడ్ చివర్లో మాధురి, తనూజ మళ్లీ కలిసిపోయి సరదాగా మాట్లాడుకోవడం చూసి, ఇమ్మాన్యుయేల్ సెటైర్లు వేస్తూ "ఇద్దరూ గొడవలు పడతారు, వెంటనే కలిసిపోతారు.. మధ్యలో మేమంతా బకరా అవుతాం" అని అన్నాడు.
రీ-ఎంట్రీ ఇచ్చిన భరణి, శ్రీజలలో ఎవరు హౌస్‌లో కొనసాగుతారు అనే విషయంపై బిగ్ బాస్ మూడు రౌండ్ల టాస్క్‌లను ప్రకటించి, ఆసక్తిని పెంచారు. గాయం కారణంగా భరణి మొదటి టాస్క్‌లో పాల్గొనలేకపోయాడు. అతని తరఫున దివ్య పోటీలో పాల్గొంది. ఐరన్ రూఫ్‌లపై బాక్స్‌లను బ్యాలెన్స్ చేయాల్సిన ఈ కఠినమైన టాస్క్‌లో దివ్య అద్భుతంగా ఆడి విజయం సాధించి, భరణికి మొదటి ఫ్లాగ్ పాయింట్‌ను అందించింది.
రెండో టాస్క్‌లో శ్రీజ-కళ్యాణ్ ఒక టీమ్‌గా, భరణి-రాము మరో టీమ్‌గా పోటీ పడ్డారు. ఈ రౌండ్‌లో శ్రీజ టీమ్ విజయం సాధించి, పోటీని సమం చేసింది. చివరి, కీలకమైన మూడో టాస్క్‌లో భరణి తరఫున ఇమ్మాన్యుయేల్, శ్రీజ తరఫున కళ్యాణ్ తలపడ్డారు. ఈ రౌండ్‌లో ఇమ్మాన్యుయేల్ గెలిచి, భరణికి రెండో ఫ్లాగ్ పాయింట్‌ను అందించాడు. టాస్క్ జరుగుతున్న సమయంలో శ్రీజ, పవన్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇది హౌస్ వాతావరణాన్ని మరింత హీటెక్కించింది.
"గేమ్‌లో పవన్ మమ్మల్ని (శ్రీజ, కళ్యాణ్) పట్టించుకోలేదు, అతను కళ్యాణ్‌కి సాయం చేయడానికి గేమ్ అయిపోయాక వచ్చాడు" అని శ్రీజ ఆవేశంగా ఆరోపించింది. దీనికి పవన్ "నేను కంప్లీట్ గా నీ దగ్గరే కూర్చుండి పోవాలా? కళ్యాణ్ కి దెబ్బ తగిలితే వెళ్ళాను కదా" అని జవాబిచ్చాడు. తర్వాత పవన్ వ్యంగ్యంగా చప్పట్లు కొడుతూ "హ్యాపీ న్యూ ఇయర్" అని అన్నాడు. పవన్ వ్యంగ్యానికి కోపం కట్టలు తెంచుకున్న శ్రీజ "తొక్క తోటకూర నా దగ్గర మాట్లాడకు" అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది. గురువారం ఎపిసోడ్ ముగిసే సమయానికి భరణి రెండు ఫ్లాగ్‌లు, శ్రీజ ఒక ఫ్లాగ్ తో ఆధిక్యంలో ఉన్నాడు. ఎవరు హౌస్‌లో కొనసాగుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే తుది నిర్ణయం శుక్రవారం లేదా తదుపరి ఎపిసోడ్‌లో కింగ్ నాగార్జున సమక్షంలో తేలే అవకాశం ఉంది.