Bigg Boss: విజేత ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పులు – ఏకంగా 12 రౌండ్లు..!
వరల్డ్‌లోనే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ఓటీటీ (హిందీ) సీజన్ 2 విజేత, యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఇంటిపై దుండగులు కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపుతోంది.

ఆదివారం తెల్లవారుజామున సుమారు 5:30 గంటల సమయంలో గురుగ్రామ్ లోని ఎల్విష్ నివాసం వద్ద ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి, ఏకంగా 12 రౌండ్లు గన్ ఫైర్ చేసి పరారయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని, ఫోరెన్సిక్ బృందాల సహకారంతో దర్యాప్తు ప్రారంభించారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు.
అయితే ఈ దాడి వెనుక ఉన్న కారణం ఏమిటి? ఎవరు ఇలా ఎల్విష్ యాదవ్ ఇంటిపై దాడి చేయాలనుకున్నారు? అనే ప్రశ్నలు మాత్రం ఇంకా అనుమానంగానే మిగిలిపోయాయి. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.