Maryada Manish Eliminated: బిగ్‌బాస్ నుంచి మనీష్ మర్యాద ఎలిమినేట్
Bigg Boss 9 Telugu, Maryada Manish Eliminated: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 నుంచి రెండో కంటెస్టెంట్‌గా మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యారు.
Bigg Boss 9 Telugu, Maryada Manish Eliminated: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 నుంచి రెండో కంటెస్టెంట్‌గా మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యారు. సామాన్యుడిగా హౌస్‌లోకి అడుగుపెట్టిన మనీష్, తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ వారం నామినేషన్లలో మనీష్‌తో పాటు, సుమన్‌శెట్టి, ప్రియ, డీమాన్ పవన్, హరిత హరీష్, ఫ్లోరా షైనీ, మరియు భరణి ఉన్నారు.
ఫ్లోరా, మనీష్ మధ్య తీవ్ర పోటీ
ఎలిమినేషన్ ప్రక్రియలో చివరి వరకు ఫ్లోరా షైనీ, మర్యాద మనీష్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ ఇద్దరిలో ఒకరు బయటకు వెళ్తారని ఉత్కంఠ నెలకొనగా, ప్రేక్షకులనుంచి అత్యధిక ఓట్లు పొందిన ఫ్లోరా సేఫ్ అయ్యారు. దీంతో మనీష్ బిగ్‌బాస్ హౌస్ నుండి నిష్క్రమించాల్సి వచ్చింది.
టాప్-3, బాటమ్-3 అంచనాలు
ఎలిమినేట్ అయిన తర్వాత, హోస్ట్ నాగార్జున మనీష్‌ను హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో ఎవరు టాప్-3, ఎవరు బాటమ్-3లో ఉంటారో అంచనా వేయమని కోరారు. మనీష్ తన అభిప్రాయాలను ఇలా వెల్లడించారు:
బాటమ్-3: సుమన్‌శెట్టి, ఫ్లోరా షైనీ, దమ్ము శ్రీజలు తమ ఆటతీరును మెరుగుపరచుకోవాలని సూచిస్తూ వారిని ఈ జాబితాలో ఉంచారు.
టాప్-3: భరణి, ఇమ్మాన్యుయేల్, సంజన మరియు హరిత హరీష్‌లను టాప్-3లో ఉంచి, వారి ఆటతీరును మెచ్చుకున్నారు.
అంతేకాకుండా, ఒక కంటెస్టెంట్‌పై 'బిగ్ బాంబ్' వేయమని నాగార్జున కోరగా, మనీష్ ప్రియకు బాత్రూమ్ డ్యూటీని అప్పగించారు. మనీష్ ఎలిమినేషన్, హౌస్‌లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్లకు ఒక హెచ్చరికగా మారింది.