Bigg Boss 9 : రెడ్ కార్డ్ డ్రామాతో హౌస్ మొత్తం సైలెంట్.. ఈ వారం ఫైర్ కంటెస్టెంట్ ఎలిమినేషన్
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ ఈ వారం ఊహించని మలుపులు, నాటకీయ పరిణామాలతో హోరాహోరీగా మారింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత హౌస్‌లో డ్రామా మరింత పెరిగింది.
Bigg Boss 9 : రెడ్ కార్డ్ డ్రామాతో హౌస్ మొత్తం సైలెంట్.. ఈ వారం ఫైర్ కంటెస్టెంట్ ఎలిమినేషన్
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ ఈ వారం ఊహించని మలుపులు, నాటకీయ పరిణామాలతో హోరాహోరీగా మారింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత హౌస్‌లో డ్రామా మరింత పెరిగింది. ఈ వారం ఎలిమినేషన్ మాత్రమే కాదు, ఒక కంటెస్టెంట్‌కు హోస్ట్ నాగార్జున నుంచి రెడ్ కార్డ్ వార్నింగ్ రావడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. భరణి రీ-ఎంట్రీతో మొదలైన వారం చివర్లో, ఫుడ్ ఇష్యూస్, రూల్స్ బ్రేకింగ్, అనూహ్య ఎలిమినేషన్ డ్రామాతో ఈ వారాంతపు ఎపిసోడ్స్ ప్రేక్షకులకు ఫుల్ ఫైర్ షోగా మారాయి. మరీ ముఖ్యంగా పుషింగ్ విషయంలో నాగార్జున చూపించిన సీరియస్నెస్ హౌస్‌మేట్స్‌తో పాటు ఆడియన్స్‌ను కూడా షాక్‌కు గురి చేసింది.
గతవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం భరణి, శ్రీజ మధ్య పోటీ జరగగా అందులో భరణి విజయం సాధించి హౌస్‌లోకి మళ్లీ వచ్చారు. ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే 8వ వారం నామినేషన్లలో సంజన, మాధురి, రాము, కళ్యాణ్, తనుజ, రితు, పవన్, గౌరవ్ ఉన్నారు. మొదటిసారి నామినేషన్లలోకి వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు మాధురి, గౌరవ్‌కు తక్కువ ఓట్లు వచ్చాయి. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారని టెన్షన్ నెలకొనగా, చివరికి మాధురి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. మొదట్లో గౌరవ్ ఎలిమినేట్ అయినట్లు ఊహాగానాలు వినిపించినా, చివరకు మాధురి హౌస్ నుంచి బయటకు వెళ్లినట్లు సమాచారం.
ఈ వారాంతపు ఎపిసోడ్‌లో అత్యంత నాటకీయ సన్నివేశం పవన్-రితు ట్రాక్‌లో కనిపించింది. లేటెస్ట్ ప్రోమోలో చూపించిన ఈ సంఘటన హౌస్‌ను షాక్‌కు గురి చేసింది. నాగార్జున, పవన్, రీతూకు సంబంధించిన ఒక వీడియోను ప్లే చేశారు. ఆ వీడియోలో పవన్, రీతూను బెడ్‌పైకి నెట్టడం కనిపించింది. బిగ్ బాస్ నియమాల ప్రకారం, కంటెస్టెంట్లను తోయడం లేదా కొట్టడం వంటివి చేయకూడదు.
వీడియో చూసిన తర్వాత నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంట్లో అమ్మాయిలకు ఇలా జరిగితే ఊరుకుంటారా, బెల్టుతో కొట్టరా?" అని ఆడియన్స్‌ను ప్రశ్నించగా ఆడియన్స్ కూడా తప్పు అని చెప్పారు. పవన్ వెంటనే సారీ చెప్పగా, సారీ చెబితే బిగ్ బాస్ క్షమించడు. మీకు కచ్చితంగా రెడ్ కార్డ్ పడుతుంది. బ్యాగ్ ప్యాక్ చేసుకో! బిగ్ బాస్, డోర్స్ ఓపెన్ చేయండి అంటూ నాగార్జున అరిచారు. రీతూ చౌదరి సార్, ప్లీజ్ వద్దు సార్! అని ఏడ్చినప్పటికీ, నాగార్జున తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అయితే, గత సీజన్లలో కూడా ఇలాంటి డ్రామాలు చూపించినందున, పవన్ నిజంగా ఎలిమినేట్ కావడం కేవలం ప్రోమో ట్విస్ట్ అని ఎపిసోడ్ చూసిన తర్వాత అర్థం అయింది.
ఈ వారం హౌస్‌లో జరిగిన ఫుడ్ ఇష్యూస్, రూల్స్ బ్రేకింగ్ విషయంలో నాగార్జున హౌస్‌మేట్స్‌కు గట్టి క్లాస్ తీసుకున్నారు. ఈ వారం రేషన్ మేనేజర్‌గా ఉన్న తనుజ హౌస్ డిసిప్లిన్‌ను మెయింటైన్ చేయబోతే.. సంజన, మాధురి ఆమెపై రివర్స్ ఫైర్ అయ్యారు. ముఖ్యంగా భోజనం వదిలిపెట్టడం, నిరాహార దీక్ష చేయడం వంటి విషయాలపై నాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజనను టార్గెట్ చేసుకుని.. నామినేషన్ సమయంలోనే ఎందుకలా ప్రవర్తిస్తావు? ఇది గేమ్ షో, నీ వ్యక్తిగత ఫైట్ కాదు అని హెచ్చరించారు. అలాగే మాధురిని ఉద్దేశించి గురివింద గింజలా ప్రవర్తించవద్దు అని గట్టి వార్నింగ్ ఇచ్చారు.
రేషన్ మేనేజర్ తనుజ ఆర్డర్‌ను కళ్యాణ్ పట్టించుకోకుండా.. ఆక్ పాక్ కరే పాక్ అని సమాధానం చెప్పడంపై నాగార్జున ఫైర్ అయ్యారు. కెప్టెన్ ఆర్డర్ అంటే పాటించాలి, ఫన్ కాదు అంటూ క్లాస్ పీకారు. దివ్య కూడా ఈ గొడవలో జోక్యం చేసుకోవడంతో, నాగ్ ఆమెను కూడా ప్రశ్నించారు. ఈ వారం ఎపిసోడ్ నాగార్జున క్లాస్, ఎమోషన్ కలయికతో ఫుల్ ఫైర్ షోగా మారింది. అయితే ఈ వారం దివ్వెల మాధురి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.