Bigg Boss 4 Telugu : బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4 వేడుక!

Bigg Boss 4 Telugu: బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 4 తెలుగు గ్రాండ్ గా ప్రారంభం అయింది..

Update: 2020-09-06 13:38 GMT

తెలుగులో అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4 కొద్దిసేపటి క్రితం ప్రారంభం అయింది.. నాగార్జున హోస్ట్ గా ప్రారంభం అయిన బిగ్ బాస్ షో లో ఒక్కో కాంటెస్టెంట్ ను ప్రేక్షకులకు పరిచయం చేసి హౌస్ లోకి పంపిస్తున్నారు. అదరగొట్టే సెట్టింగ్.. ఆకట్టుకునే నాగ్ హోస్టింగ్ తో గ్రాండ్ గా ప్రారంభమైన బిగ్ బాస్ ప్రారంభ కార్యక్రమం ఎలా జరుగుతోందో..ఎవరెవరు హౌస్ లోకి వేలుతున్నారో ఎప్పటికప్పుడు మీకోసం లైవ్ బ్లాగ్!




Live Updates
2020-09-06 15:43 GMT

స్పెషల్ హౌస్ మేట్ గా యుట్యూబ్ స్టార్ గంగవ్వ ఎంట్రీ ఇచ్చారు. ౧౬ వ కంటేస్టెంట్ గా గంగవ్వ ఇన్స్పైరింగ్ ఎంట్రీ అదిరిపోయింది. అచ్చ తెలంగాణా స్టార్ గంగవ్వ వెళ్లారు.

బిగ్ బాస్ విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

2020-09-06 15:23 GMT

బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టంట్ లు వరుసగా వెళుతున్నారు. ఇప్పటి వరకూ మొత్తం 14మంది ఎంట్రీ ఇచ్చారు. 13 వ హౌస్ మెట్ గా రాక్ సింగర్ నోయల్ సేన్ ..14 వ హౌస్ మెట్ గా దివ్యా వాద్త్యా లోపలి వెళ్ళారు.

మరిన్ని బిగ్ బాస్ విశేషాలు ఎప్పటికప్పుడు లైవ్ బ్లాగ్ లో ఇక్కడ క్లిక్ చేయండి 

2020-09-06 14:54 GMT

బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టంట్ ల ఎంట్రీ కార్యక్రమం హుషారుగా సాగుతోంది. హోస్ట్ గా నాగార్జున తన ఆట మొదలు పెట్టేశారు. పదకొండో కంటెస్టంట్ గా అమ్మ రాజశేఖర్..పన్నెండో కంటెస్టంట్ గా కరాటే కల్యాణి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.

మరిన్ని బిగ్ బాస్ విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

2020-09-06 14:44 GMT

బిగ్ బాస్ హౌస్ లోకి 9-10 కంటెస్టంట్  లుగా ఇస్మార్ట్ సోహియాల్.. అరియానా గ్లోరీ వెళ్ళారు. అయితే వారిద్దర్నీ నేరుగా హౌస్ లోకి పంపించలేదు నాగార్జున. వారిని ప్రత్యేకంగా ఉంచారు. వారికి టీవీ సదుపాయం కల్పించిన బిగ్ బాస్ అందులో బిగ్ బాస్ లో జరుగుతున్నా విశేషాలు చూడొచ్చని చెప్పారు. 

2020-09-06 14:37 GMT
బిగ్ బాస్ హౌస్ లోకి కంటె స్టంట్ లను పంపించే కార్యక్రమం ఆకట్టుకునేలా సాగుతోంది. ఇప్పటివరకూ మొత్తం 8 మంది హౌస్ మేట్స్ హౌస్ లోకి వెళ్ళారు. హౌస్లోకి  యూ ట్యూబ్ స్టార్ దిల్ సే మెహబూబ్, టీవీ జర్నలిస్ట్ దేవి నాగవల్లి, దేత్తడి హారిక ఎంట్రీ ఇచ్చారు.
2020-09-06 14:03 GMT

ఐదో హౌస్ మేట్ గా మా.. జోర్దార్ సుజాత హౌస్ లోకి అడుగుపెట్టారు. నాగార్జున ను బిట్టూ అంటూ సంబోధించి.. బిగ్ బాస్ కార్యక్రమానికి జోర్దార్ ఎంట్రీ ఇచ్చారు సుజాత. ఆల్ ది బెస్ట్ శృతి..కాదు కాదు.. మా జోర్దార్ సుజాత!

మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

2020-09-06 13:50 GMT
 నలుగురు హౌస్ మేట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. తొలి హౌస్మేట్‌గా హీరోయిన్ మోనాల్ గజ్జర్, రెండో హౌస్ మెట్ గా  దర్శకుడు సూర్య కిరణ్, మూడో కంటె స్టంట్ గా ప్రముఖ యాంకర్ లయ, నాలుగో కంటెస్టంట్ గా నటుడు అభిజిత్ హౌస్ లోకి అడుగుపెట్టారు. 
2020-09-06 13:39 GMT

ఈ షోలో హోస్ట్ నాగార్జున డ్యుయల్ రోల్‌తో కనిపించారు. ముందు హోస్ట్ నాగార్జున వచ్చారు.. ఆయన తండ్రి పాత్రలో అతిథిగా ముసలి నాగార్జున వచ్చారు. ఆయన బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లి కలియతిరిగారు. తన స్టైల్లోనే పంచ్‌లు, చమత్కారాలతో అదరగొట్టారు.

Tags:    

Similar News