భోజ్‌పురి నటి ఆకాంక్ష దుబే ఆత్మహత్య.. ఇవాళ ఉదయమే విడుదలైన దుబే పాడిన కొత్త పాట

Akanksha Dubey: భోజ్‌పురి నటి ఆకాంక్ష దుబే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

Update: 2023-03-26 12:00 GMT

భోజ్‌పురి నటి ఆకాంక్ష దుబే ఆత్మహత్య.. ఇవాళ ఉదయమే విడుదలైన దుబే పాడిన కొత్త పాట

Akanksha Dubey: భోజ్‌పురి నటి ఆకాంక్ష దుబే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. వారణాసిలోని ఓ హోటల్లో ఆమె డెడ్‌బాడీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె పాడిన కొత్త పాట... యే ఆరా కభీ నహీ హై ఆదివారం ఉదయం 7 గంటల 45 నిమిషాలకు విడుదలయ్యింది. సాంగ్ విడుదలకు ముందు లేదా ఆ తర్వాత చనిపోయారా అన్నది తేలియాల్సి ఉంది. అసలు ఆమె హోటల్లో ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో దుబే ఓ డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేశారు. భోజ్‌పురి పాటకు బెల్లి డ్యాన్స్ మూమెంట్స్‌ ఇస్తూ డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆకాంక్ష దుబే ఆకస్మిక మరణంపై ఆమె అభిమానులు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు.


Tags:    

Similar News