Bheemla Nayak: గణతంత్ర దినోత్సవం లేదా శివరాత్రి అంటున్న "భీమ్లా నాయక్"

*ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కాబోతోంది.

Update: 2021-11-07 13:30 GMT

గణతంత్ర దినోత్సవం లేదా శివరాత్రి అంటున్న "భీమ్లా నాయక్"(ఫోటో- ది హన్స్ ఇండియా)

Bheemla Nayak: ఈ మధ్యనే "వకీల్ సాబ్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఇప్పుడు మలయాళంలో సూపర్ హిట్టయిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

రానా దగ్గుబాటి కూడా హీరోగా నటిస్తున్న ఈ సినిమా "భీమ్లా నాయక్" అనే టైటిల్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాగర్ కే చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో నిత్యమీనన్ కనిపించబోతుండగా, రానా సరసన మలయాళం బ్యూటీ సంయుక్త మీనన్ కనిపించబోతోంది.

సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కాబోతోంది. అయితే సినిమా విడుదల తేదీ పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. తాజా సమాచారం ప్రకారం "భీమ్లా నాయక్" సినిమా వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

లేకపోతే వచ్చే ఏడాది మార్చి లో శివరాత్రి సందర్భంగా కూడా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Tags:    

Similar News