Bhagya Sree: గాయపడ్డ బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ నటి.. నుదిటిపై 13 కుట్లు..!
Bhagya Sree Injured: బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ తీవ్రంగా గాయపడ్డారు. ఆమె పికిల్ బాల్ ఆడుతుండగా నుదిటిపై లోతైన గాయం అయింది. ఈనేపథ్యంలో ఆమెకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Bhagya Sree Injured: బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ బ్యూటీ భాగ్యశ్రీ నుదిటిపై తీవ్ర గాయం అయింది. దీంతో ఆమెకు 13 కుట్లు కూడా పడ్డాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. భాగ్యశ్రీ పికిల్ బాల్ ఆడుతుండగా నుదిటిపై లోతైన గాయం అయినట్లు తెలుస్తోంది. ఆమె త్వరలో కోలుకోవాలని సినీ వర్గాలు, ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
భాగ్యశ్రీ బాలీవుడ్ సీనియర్ నటి. ఈమె ఎప్పటికప్పుడు ఆరోగ్యంపై కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌కు అవగాహన పెంచే టిప్స కూడా షేర్ చేస్తుంది. అయితే, ఇన్‌స్టాగ్రామ్ వేధికగా భాగ్యశ్రీ ఆసుపత్రిలో ఉన్న ఫోటోను షేర్ చేసిది. ఈ ఫోటోలో భాగ్యశ్రీ ఆసుపత్రి బెడ్‌పై చికిత్స తీసుకుంటుంది. మరో ఫోటోలో ఆమె నవ్వుతూ ఉంది కానీ, నుదిటిపై బ్యాండేజీ ఉంది. దీంతో భాగ్యశ్రీ ఫ్యాన్స్ ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.
మైనే ప్యార్ కియా (1989) సినిమా ద్వారా ఫేమ్ పొందారు. ఈ సినిమాలో హీరో సల్మాన్ ఖాన్ నటించారు. కుటుంబ నేపథ్యం ఆధారంగా తీసిన ఈ చిత్రం అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఇప్పటికీ భాగ్యశ్రీ అందం తరగనిది. ఆ సినిమా తర్వాత వెంటనే ఆమె ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు.
టెలివిజన్‌తోపాటు తెలుగు, కన్నడ, మరాఠీ సినిమాల్లో కూడా నటించారు. ఇటీవల కంగానా రనౌత్ నటించిన తలైవీ (2021)లో చాలా రోజుల తర్వాత భాగ్యశ్రీ నటించారు. జయలలిత అమ్మ పాత్ర పోషించారు. ఆ తర్వాత రాధేశ్యామ్ (2022) లో కూడా నటించారు.ఇందులో ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలో నటించారు.
భాగ్యశ్రీ హిమాలయ దాసనీని 1989లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు కూడా ఉన్నారు. ఈమె ఫిబ్రవరి 23, 1969లో మరాఠి ఫ్యామిలీలో జన్మించారు. అంతేకాదు డ్యాన్స్ రియాలిటీ షో అయినా 'DID సూపర్ మామ్స్'కు జడ్జీగా కూడా వ్యవహరించారు భాగ్యశ్రీ. అయితే ఈమె కచ్చి ధూప్ అనే హిందీ టెలివిజన్ ద్వారా సినీ కెరీర్ ప్రారంభించారు.