OTT Movies: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోన్న డబ్బింగ్‌ మూవీస్‌

OTT Movies: ఒకప్పుడు కేవలం హిందీ చిత్రాలకు మాత్రమే తెలుగులో డిమాండ్ ఉండేది. కానీ ప్రస్తుతం తమిళంతోపాటు, మలయాళ చిత్రాలకు సైతం డిమాండ్‌ పెరుగుతోంది.

Update: 2024-06-19 14:15 GMT

OTT Movies: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోన్న డబ్బింగ్‌ మూవీస్‌.. 

OTT Movies: ఓటీటీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత డబ్బింగ్ చిత్రాలకు హవా పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం హిందీ చిత్రాలకు మాత్రమే తెలుగులో డిమాండ్ ఉండేది. కానీ ప్రస్తుతం తమిళంతోపాటు, మలయాళ చిత్రాలకు సైతం డిమాండ్‌ పెరుగుతోంది. మరి ఓటీటీలో తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న కొన్ని బెస్ట్‌ డబ్బింగ్ చిత్రాలు ఏంటి.? ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పుడు తెలుసుకుందాం..

* ది గోట్‌ లైఫ్‌ (ఆడు జీవితం) సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. బెన్నీ డానియల్‌ (బెన్యామిన్) రాసిన ‘గోట్ డేస్’ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా... మ‌ల‌యాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార‌న్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ నెలలో డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

* ఇక తమన్నా, రాశి ఖన్నా నటించిన కామెడీ హారర్‌ థ్రిల్లర్‌ సినిమా బాక్‌పై కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ జూన్‌ 21వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో తమిళం, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కు రానుంది.

* తమిళంలో మంచి విజయం సాధించిన గరుడన్‌ చిత్రం కోసం కూడా ఓటీటీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా జూన్ 28వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది.

* కోలీవుడ్‌కు చెందిన కమెడియన్‌ యోగిబాబు నటించిన గురువాయూర్ అంబలనాడయిల్ చిత్రం ఓటీటీలో తెలుగు వెర్షన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా జూన్‌ 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

* ఇక మలయాళ స్టార్ హీరో నటించిన.. సస్పెన్స్ థ్రిల్లర్ టర్బో. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో జూన్ 28వ తేదీ నుంచి తెలుగులో కూడా ప్రేక్షకుల ముందుకు అందుబాటులోకి రానుంది.

Tags:    

Similar News