Chatrapathi: వ‌ర్షాల‌తో దెబ్బ‌తిన్న‌ 'ఛత్రపతి' మూవీ సెట్‌

Chatrapathi: బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా హిందీలో 'ఛత్రపతి' సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2021-06-04 15:00 GMT

బెల్లంకొండ శ్రీను, ప్రభాస్ (ఫొటో ట్విట్టర్)

Chatrapathi: బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా హిందీలో 'ఛత్రపతి' సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా షూటింగ్ కోసం వేసిన సెట్.. వర్షంతో పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. క‌ళా ద‌ర్శ‌కుడు సునీల్ బాబు ఆధ్వ‌ర్యంలో సుమారు రూ.3 కోట్ల వ్యయంతో 6 ఎకరాల్లో ఓ ఊరి సెట్ వేశారంట.

కాగా, ఏప్రిల్ 22 నుంచి షూటింగ్ మొదలు పెట్టాలని అనుకున్నారంట. కానీ, కరోనా సెకండ్ వేవ్ తో అదికాస్తా వాయిదా పడింది. ప్ర‌స్తుతం వ‌ర్షాలు ప‌డ‌టంతో సెట్ డ్యామేజ్ అయింది. మరలా షూటింగ్ ప్రారంభించే ముందే సెట్‌ని పునర్నిర్మించాలని అనుకుంటున్నారంట మేకర్స్.

వినాయ‌క్‌- శ్రీనివాస్ కల‌యిక‌లో గతంలో వ‌చ్చిన 'అల్లుడు శీను' హిట్ కావ‌డంతో.. ఈ రీమేక్‌పై అంచ‌నాలు భారీగా నెలకొన్నాయంట. అలాగే తమిళంలో ధనుష్ హీరోగా వచ్చిన 'కర్ణన్' సినిమాను బెల్లకొండ శ్రీనివాస్ తెలుగులో రీమేక్ చేయనున్నట్లు టాక్ నడుస్తోంది.

Tags:    

Similar News