Bigg Boss Telugu 7: బిగ్ బాస్ పై క్లారిటీ ఇచ్చిన బ్యాంకాక్ పిల్ల..
Bangkok Pilla on Big Boss: టీవీ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించే ప్రోగ్రామ్స్‌లో ‘బిగ్‌బాస్’ (Bigg Boss) ఒకటిగా పేరుగాంచింది.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ పై క్లారిటీ ఇచ్చిన బ్యాంకాక్ పిల్ల..
Bangkok Pilla on Big Boss: టీవీ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించే ప్రోగ్రామ్స్‌లో ‘బిగ్‌బాస్’ (Bigg Boss) ఒకటిగా పేరుగాంచింది. తెలుగులో ఇప్పటి వరకు 6 సీజన్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా 7వ సీజన్ (Bigg Boss Telugu 7)తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. ఈ మేరకు మేకర్స్ నెట్టింట్లో ఓ వీడియోని రిలీజ్ చేశారు. బిగ్ బాస్ 7 ప్రోగ్రాం త్వరలోనే టెలికాస్ట్ కానుందని తెలిపారు. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తయిందట. ఇక ఆ లిస్ట్ ఎలాగో షో ప్రారంభం వరకు బయటకు రాదు. కానీ ఎప్పటి మాదిరే ఈ సారి కూడా బిగ్‌బాస్-7 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి.
ఐతే ఈ లిస్టులో యూట్యూబ్ సెన్సేషన్ కూడా చేరినట్లు వార్తలు వచ్చాయి. వ్లాగ్స్ తో బాగా ఫేమస్ అయిన బ్యాంకాక్ పిల్ల శ్రావణిని బిగ్ బాస్ నిర్వాహకులు కాంటాక్ట్ అయినట్లు న్యూస్ వైరల్ అయింది. ఇటీవల శ్రావణి బ్యాంకాక్ నుంచి ఇండియాకు రావడంతో ఆమె బిగ్ బాస్ కోసమే వచ్చిందంటూ ప్రచారం జరిగింది. ఆమె పోస్ట్ చేసిన ట్రావెల్ వీడియోకు కామెంట్స్ కూడా బిగ్ బాస్ పైనే వచ్చాయి. దీంతో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలపై బ్యాంకాక్ పిల్ల క్లారిటీ ఇచ్చింది.
అసలు తకు బిగ్‌బాస్ నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని, పిలవని పేరెంటానికి వెళ్తే బాగోదని చెప్పింది. ‘నేను బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నాననే వార్తలు ఎవరు పుట్టించారో తెలియదు కానీ.. నాకే ఆశ్చర్యం కలిగింది. ఆ వార్తలు బాగా వైరల్ కావడంతో నిజంగానే నేను సెలెక్ట్ అయ్యానా అని మెయిల్స్ చెక్ చేసుకున్నాను. నాకు ఎలాంటి ఆహ్వానం రాలేదు. ఒకవేళ వస్తే తప్పకుండా అందరికి చెబుతాను. ఇలాంటి ఫేక్ న్యూస్‌ని నమ్మకండి’ అని శ్రావణి చెప్పుకొచ్చింది.