Bandla Ganesh: రీమేక్ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్న బండ్ల గణేష్

Bandla Ganesh: నటుడిగా మాత్రమే కాక నిర్మాతగా కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బండ్లగణేష్ తాజాగా ఇప్పుడు హీరోగా మారబోతున్నారు.

Update: 2021-08-20 13:03 GMT

Bandla Ganesh: రీమేక్ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్న బండ్ల గణేష్

Bandla Ganesh: నటుడిగా మాత్రమే కాక నిర్మాతగా కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బండ్లగణేష్ తాజాగా ఇప్పుడు హీరోగా మారబోతున్నారు. బండ్ల గణేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వెంకట్ చంద్ర అనే ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 గా ఈ చిత్రం తెరకెక్కనుంది. బండ్ల గణేష్ ను హీరోగా పరిచయం చేయబోతున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారం నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు దర్శకనిర్మాతలు.

"బండ్ల గణేష్ అయితేనే హీరో పాత్రకు న్యాయం చేయగలుగుతారని మొదట ఆయనే సంప్రదించడం జరిగింది. ఆయన వెంటనే ఓకే చెప్పడంతో మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు. తమిళంలో ఆర్ పార్తిబన్ గారు హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించిన బ్లాక్ బస్టర్ సినిమా "ఒత్తు సెరుప్పు సైజ్ 7" కి రీమేక్ గా ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి అరుణ్ దేవినేని ఛాయాగ్రహకులు," అని చెప్పు కొచ్చారు దర్శకనిర్మాతలు. మరోవైపు హిందీలో కూడా "ఒత్తు సెరుప్పు సైజ్ 7" సినిమా అభిషేక్ బచ్చన్ హీరోగా రీమేక్ అవుతోంది.

Tags:    

Similar News