Sukumar-Ashish Reddy: సుకుమార్ నిర్మాణంలో దిల్ రాజు మేనల్లుడు

Sukumar-Ashish Reddy: మరొక సినిమా సైన్ చేసిన దిల్ రాజు మేనల్లుడు

Update: 2022-01-17 14:30 GMT

సుకుమార్ నిర్మాణంలో దిల్ రాజు మేనల్లుడు

Sukumar-Ashish Reddy: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి ఈ మధ్యనే సంక్రాంతి సందర్భంగా విడుదలైన "రౌడీ బాయ్స్" అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే తన పెర్ఫార్మెన్స్తో అందరి దృష్టిని ఆకర్షించిన ఆశిష్ రెడ్డి తాజాగా ఇప్పుడు తన రెండవ సినిమాని సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి "సెల్ఫిష్" అనే టైటిల్ ను ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. ఇంతకు ముందు సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన కాశీ ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నారు.

సుకుమార్ రైటింగ్స్ మరియు దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. "ఆశిష్ ఫోటోలు వీడియోలు చూశారు. తన యూత్ఫుల్ లుక్ సుకుమార్ కి బాగా నచ్చింది. తనైతే కథకి బాగా సెట్ అవుతాడని నిర్ణయించుకుని మతో సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్ర షూటింగ్ షెడ్యూల్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది" అని చెప్పుకొచ్చారు దిల్ రాజు. మరోవైపు "రౌడీ బాయ్స్" సినిమా అనుకున్న విజయం సాధించలేక బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. మొదటి రోజు నుండే సినిమా కలెక్షన్లు అంతంత మాత్రమే.

Tags:    

Similar News