Arjun Son of Vyjayanthi OTT: ఓటీటీలోకి అర్జున్ సన్నాఫ్ వైజయంతి.. కానీ ఓ చిన్న ట్విస్ట్..!

కల్యాణ్ రామ్, విజయశాంతి నటించిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ సడెన్‌గా ఓటీటీ స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. ప్రస్తుతం యూకేలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇండియాలో ఎప్పుడు స్ట్రీమింగ్‌కు వస్తుందో తెలుసుకోండి.

Update: 2025-05-12 10:04 GMT

Arjun Son of Vyjayanthi OTT: ఓటీటీలోకి అర్జున్ సన్నాఫ్ వైజయంతి.. కానీ ఓ చిన్న ట్విస్ట్..!

Arjun Son of Vyjayanthi OTT: టాలీవుడ్‌ నటుడు కల్యాణ్ రామ్, లెజెండరీ నటి విజయశాంతి కీలక పాత్రల్లో నటించిన సినిమా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' (Arjun S/O Vyjayanthi) థియేటర్లలో రిలీజ్‌ అయి నెల రోజులు కూడా పూర్తవకముందే ఓటీటీ వేదికపైకి వచ్చేసింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామా ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనను అందుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా మే 12 అర్థరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. అయితే, చిన్న ట్విస్ట్ ఏమిటంటే ప్రస్తుతం ఈ మూవీ తెలుగు వెర్షన్ కేవలం యూకే ప్రాంతంలోని ప్రేక్షకులకు మాత్రమే అందుబాటులో ఉంది. అంతే కాదు, అద్దె (Rent) విధానంలో మాత్రమే చూడాల్సి ఉంటుంది.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఓటీటీ స్ట్రీమింగ్ ఇండియాలో ఎప్పుడు ఉంటుందో అనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ వారం గురువారం లేదా శుక్రవారం నుండి ఇండియన్ యూజర్లకు కూడా ఈ సినిమా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ చిత్రంలో కల్యాణ్ రామ్, విజయశాంతితో పాటు బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, సోహైల్ ఖాన్ కీలక పాత్రలు పోషించారు. బబ్లూ పృథ్వీరాజ్, చరణ్ రాజ్, శ్రీరామ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించగా, సాయి మంజ్రేకర్ కథానాయికగా కనిపించారు.

Tags:    

Similar News