రామ్ చరణ్ సినిమా నుంచి తప్పుకున్న ఏఆర్ రెహమాన్..?
ఆర్సీ 16 షూటింగ్‌కు ముందే రెహమాన్ రెండు సాంగ్స్‌కి ట్యూన్స్ కూడా కట్టి ఇచ్చారని టాక్. అలాంటి రెహమాన్ ఇప్పుడు సడెన్‌గా చెర్రీ మూవీ నుంచి తప్పుకున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది.
రామ్ చరణ్ సినిమా నుంచి తప్పుకున్న ఏఆర్ రెహమాన్..?
AR Rahman Left Ram Charan's Movie: రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ RC16. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఆర్ఆర్ఆర్, గేమ్ ఛేంజర్ సినిమాకి ఎక్కువ సమయం తీసుకున్న రామ్ చరణ్.. ఇప్పుడు ఈ సినిమాను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తప్పుకున్నారనే వార్త చక్కర్లు కొడుతుంది. ఈ వార్తతో మెగా ఫ్యాన్స్‌ను నిరాశకు గురవుతున్నట్టు తెలుస్తోంది.
RC 16 షూటింగ్‌కు ముందే రెహమాన్ రెండు సాంగ్స్‌కి ట్యూన్స్ కూడా ఇచ్చారని టాక్. అలాంటి రెహమాన్ ఇప్పుడు సడెన్‌గా చెర్రీ మూవీ నుంచి తప్పుకున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు రెహమాన్ ప్లేస్‌లో దేవీశ్రీప్రసాద్ ఛాన్స్ కొట్టేశారనే ప్రచారం సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. నిజానికి ఈ సినిమా కోసం రెహమాన్‌ను బుచ్చిబాబు ఏరికోరి ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మరి అలాంటి బుచ్చిబాబు రెహమాన్‌ను ఎందుకు వదులుకుంటారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
చరణ్ సినిమాను దసరాకి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కానీ రెహమాన్‌కు ఉన్న బిజీలో స్వరాలు అందించేందుకు చాలా టైమ్ పట్టే అవకాశాలు ఉన్నాయి. దేవిశ్రీ అయితే అనుకున్న సమయంలో ఇస్తారని మూవీ యూనిట్ భావిస్తోందని టాక్. రెహమాన్ ఇటీవల తన భార్యకు డైవర్స్ ఇవ్వడం, పర్సనల్ ప్రాబ్లమ్స్‌తో పాటు కొన్ని కీలక ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఇలాంటి టైమ్‌లో రెహమాన్‌తో త్వరగా మ్యూజిక్ కంపోజ్ చేయించడం కష్టమని అందుకే బుచ్చిబాబు దేవీశ్రీని ఆశ్రయించినట్టు ప్రచారం నడుస్తోంది.
అయితే కొందరు ఇది రూమర్ మాత్రమే అంటున్నారు. ఇప్పటికే రెహమాన్ ఈ సినిమా కోసం కొన్ని పాటలు కూడా చేశారని.. ఇలా సగంలో సినిమాను వదిలేయరని అంటున్నారు. సగం ఆల్బమ్ తన పేరు, మిగిలిన సగం ఇంకొకరి పేరు వేసే ఆప్షన్ రెహమాన్ ఎప్పుడూ తీసుకోడని అంటున్నారు. బుచ్చిబాబు చెప్పిన కథ విపరీతంగా నచ్చిందని రెహమాన్ ఇప్పటికే చెప్పారు. కాబట్టి తప్పుకునే ఛాన్స్ అసలు ఉండదంటున్నారు. మరి ఈ గాసిప్‌లో నిజమెంత అనేది మూవీ టీమ్ క్లారిటీ ఇస్తే గానీ ఈ వార్తలో నిజం ఎంతుందో తెలియదు.
ఇక ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. సంక్రాంతికి విడుదలైన గేమ్‌ఛేంజర్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు బాగుందని.. మరికొందరు యావరేజ్ అంటూ వారి అభిప్రాయాలను తెలియజేశారు. గేమ్ ఛేంజర్ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మెగా అభిమానులను ఈ వార్త నిరాశకు గురిచేసింది. దీంతో ఈసారి దసరాకు మంచి హిట్ ఇవ్వాలని భావిస్తున్న రామ్ చరణ్.. RC16పై ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.