RC-16: రామ్ చరణ్ RC16 రిలీజ్ అయ్యేది ఆ పండుగకే.. ట్వీట్ వైరల్


రామ్ చరణ్ RC16 రిలీజ్ అయ్యేది ఆ పండుగకే.. ట్వీట్ వైరల్
ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో RC-16 మూవీ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
RC16: రామ్ చరణ్ రీసెంట్‌గా నటించిన గేమ్ ఛేంజర్ భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. అయితే ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో RC-16 మూవీ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC-16 సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా అనుకున్న దానికంటే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నటీనటులు, సిబ్బంది, సాంకేతిక నిపుణుల తేదీలు షెడ్యూల్ ప్రకారం ట్రాక్‌లో ఉన్నాయి. దీంతో ఈ సినిమాను దీపావళికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. సాధ్యమైనంత వరకు ఈ పండగకే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఓ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
#RC16 - The shoot is progressing at a faster pace than expected
— Daily Culture (@DailyCultureYT) March 5, 2025
Additionally, the dates of cast, crew, technicians, and everything else are on track as per the schedule#RamCharan wanted to release the film this year itself
Might target for diwali release pic.twitter.com/Bg55Upb01Y
ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అలాగే కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ శివన్న లుక్ టెస్ట్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఇందులో ఆయన కురుణడ చక్రవర్తి పాత్రలో కనిపిస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు త్వరలోనే ఆయన షూట్‌లో పాల్గొననున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో జరుగుతుంది. ఇక్కడ కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించినట్టు సమాచారం. అలాగే జామా మసీదు వద్ద కూడా కొన్ని సీన్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
Completed the look test of Karunada Chakravarthy @NimmaShivanna Garu for #RC16 #RamCharanRevolts
— BA Raju's Team (@baraju_SuperHit) March 5, 2025
Global Star @AlwaysRamCharan pic.twitter.com/wki5bmJOez
శరవేగం షూటింగ్ జరుపుకుంటున్న RC-16 సినిమాను దీపావళి నాటికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



