K.Viswanath: కె విశ్వనాథ్ మృతి పట్ల సంతాపం తెలిపిన ఏపీ సీఎం జగన్‌

K.Viswanath: దిగ్గజ దర్శకుడు విశ్వనాథ్ తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారని ఏపీ జగన్‌ అన్నారు

Update: 2023-02-03 02:57 GMT

K.Viswanath: కె విశ్వనాథ్ మృతి పట్ల సంతాపం తెలిపిన ఏపీ జగన్‌ 

K.Viswanath: దిగ్గజ దర్శకుడు విశ్వనాథ్ తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. విశ్వనాథ్‌ మరణం తీవ్ర విచారానికి గురిచేసిందని ఆ‍యన అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్‌ అని, ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీరంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయన్నారు. తెలుగు వారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారని కొనియాడుతూ... ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.


Tags:    

Similar News