Anushka Shetty Rudramadevi : అనుష్క రుద్రమదేవికి 150 మిలియన్ల వ్యూస్..!
Anushka Shetty Rudramadevi : మన తెలుగు సినిమాలన హిందీలోకి డబ్ చేస్తే ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు.. ఇప్పటికే రామ్ హలో గురు ప్రేమకోసమే
Anushka Shetty Rudramadevi movie
Anushka Shetty Rudramadevi : మన తెలుగు సినిమాలన హిందీలోకి డబ్ చేస్తే ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు.. ఇప్పటికే రామ్ హలో గురు ప్రేమకోసమే.. విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ చిత్రాలు అందుకు చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.. ఇప్పుడు ఇదే జాబితాలోకి చేరింది అనుష్క రుద్రమదేవి చిత్రం.. గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హిస్టారికల్ మూవీ 2015లో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. 3డి చిత్రంగా ఒకేసారి తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో రిలిజైంది ఈ చిత్రం..
అనుష్కశెట్టి, అల్లు అర్జున్, కృష్ణంరాజు, దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజ్, నిత్య మెనన్, బాబా సెహగల్, కేథరీన్ లతో కూడిన భారీ తారాగణం ఈ సినిమాలో ఉన్నారు. రాణి రుద్రమదేవి చరిత్రను ఆధారం చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించారు దర్శకుడు గుణశేఖర్.. అయితే రుద్రమదేవి హిందీ వెర్షన్ కు యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే అద్బుతమైన స్పందన వస్తోంది. ఇప్పటివరకూ ఈ సినిమాకి 150 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ముఖ్యంగా గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
ప్రస్తుతం అనుష్క నిశబ్దం అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు.. మాధవన్, అంజలి మొదలగు వారు ముఖ్యపాత్రలు పోషించారు. కోనా వెంకట్, టి జి విశ్వ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు. కరోనా వలన ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.