Anushka Shetty: సస్పెన్స్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటున్న 'నిశ్శబ్దం' ట్రైలర్

Anushka Shetty: సస్పెన్స్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటున్న నిశ్శబ్దం ట్రైలర్
x
Highlights

లేడి ఓరియేంటడ్ సినిమాలు అంటే అందరికి టక్కున గుర్తొచ్చే పేరు అనుష్కనే.. అరుంధతి, రుద్రమదేవి లాంటి సినిమాలలో నటించి ఆ సినిమాలని హిట్ మెట్టు ఎక్కించింది.

లేడి ఓరియేంటడ్ సినిమాలు అంటే అందరికి టక్కున గుర్తొచ్చే పేరు అనుష్కనే.. అరుంధతి, రుద్రమదేవి లాంటి సినిమాలలో నటించి ఆ సినిమాలని హిట్ మెట్టు ఎక్కించింది. ఇక భాగమతి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క ఇప్పుడు 'నిశబ్దం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గత కొద్దిరోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాని ఏప్రిల్ రెండున రిలీజ్ చేయనున్నారు. కోనా వెంకట్, టి జి విశ్వ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు.

సినిమా ప్రమోషన్ లో భాగంగా సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రీలీజ్ చేశారు. నిమిషం 26 సెకండ్స్ ఉన్న చిత్ర టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్కతో పాటు మాధవన్, అంజలి, సుబ్బరాజు, శాలిని పాండే నటించారు. ఓ హౌస్ ముందు ఓ విదేశీ రిపోర్టర్ నిలబడి న్యూస్ చదువుతున్న సీన్‌తో ట్రైలర్ మొదలు అవుతుంది.

ఆ ఇంట్లో అనుష్క పైన ఎవరో అటాక్ చేయడం, ఆ తర్వాత అనుష్క హాస్పిటల్ లో ఉండడం, అక్కడ అంజలి అనుష్కని ఇన్వెస్టిగేషన్ చేయడం, మధ్యలో మాధవన్, శాలిని పాండేను లను అనుమానంగా చూపించడం ట్రైలర్ లో ఆసక్తిగా కనిపించింది. ఇందులో అనుష్క ముగ అమ్మాయిగా కనిపించడం సినిమాకి హైలెట్ గా నిలవనుంది. ఇక ఇందులో హాలీవుడ్ నటుడు మైఖెల్ మ్యాడ్సన్ కీలక పాత్రను పోషించారు.దాదాపుగా సినిమా షూటింగ్ ని ఎక్కువ భాగం అమెరికాలోనే షూట్ చేశారు. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories