ప్లీజ్ అనుష్కపై ఆ రూమర్స్ నమ్మొద్దు.. నిజం కాదు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'నిశ్శబ్దం'.

Update: 2020-04-22 09:20 GMT
Anushka shetty (File Photo)

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'నిశ్శబ్దం'. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీలో స్మైలీ స్టార్ మాధవన్ కీ రోల్ పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై కోనవెంకట్, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, హిందీ, ఇంగ్లీష్, మ‌ల‌యాళ‌ భాష‌ల్లో విడుద‌లకు ప్లాన్ చేయగా.. కరోనా ప్రభావంతో లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం విడుదల వాయదా పడింది.థియేటర్స్‌లో విడుదల చేసే అవకాశం లేకపోవడంతో తప్పని సరి పరిస్థితుల్లో వాయిదా పడింది.

ఈ సినిమాలో సాక్షి అనే మూగ అమ్మాయి పాత్రలో వైవిధ్యమైన నటనతో అనుష్క నటించారు. మాధ‌వ‌న్‌‌, అంజ‌లి, షాలిని పాండే, మైకేల్ మ్యాడ్‌సన్,సుబ్బరాజ్‌, శ్రీనివాస్ అవ‌స‌రాల కీల‌క భూమిక పోషించారు. తాజాగా ఈ చిత్రంపై అనేక రూమర్స్ వస్తున్న నేపథ్యంలో దయచేసి ఇలాంటి వదంతులు నమ్మొదంటు ఏదైనా ఉంటే మేమే అఫీషియల్స్‌గా ప్రకటిస్తాం అంటూ చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది.

అయితే ఈ మూవీ రిలీజ్‌ విషయంలో నిర్మాతలకు అనుష్కకు మధ్య వివాదం నడుస్తోందంటూ కూడా పలు రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్లో ఆన్ లైన్‌లో విడుదల చేయాలని అనుష్క అన్నట్లు టాక్ వచ్చింది. 'నిశ్శబ్దం-ఆన్ లైన్'హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. దీంతో నిశ్శబ్దం చిత్ర యూనిట్ వీటిపై క్లారిటీ ఇచ్చారు.

'నిశ్శబ్దం'సినిమా విషయంలో అనుష్క సహకారం మరువలేనిది. దయచేసి ఈ చిత్రంపై వస్తున్న రూమర్స్ నమ్మొద్దు. సినిమా ప్రారంభమైన తొలిరోజు నుంచి అన్ని విషయాల్లోనూ సినిమాకి పనిచేసే నటీనటులు, టెక్నీషియన్లు ఆ ప్రాజెక్ట్‌కి పిల్లర్స్‌. కష్టమైనా, నష్టమైనా భరిస్తారు ఈ రూమర్స్ నమ్మొద్దు అవి నిజం కావునీ చిత్ర యూనిట్ తెలిపింది. అలాంటివి ఏమైనా ఉంటే స్వయంగా తెలియజేస్తాం'అంటూ 'నిశ్శబ్దం'సినిమా యూనిట్ స్పష్టం చేసింది.




 


Tags:    

Similar News