Ante Sundaraniki Movie: మాల్దీవ్స్ లో షూటింగ్ చేస్తున్న "అంటే సుందరానికి" బృందం

Ante Sundaraniki Movie: షూటింగ్ మొదలు పెట్టిన "ఆంటే సుందరానికి" బృందం

Update: 2022-01-11 16:30 GMT

షూటింగ్ మొదలు పెట్టిన "ఆంటే సుందరానికి" బృందం

Ante Sundaraniki Movie: నాచురల్ స్టార్ నాని ఈ మధ్యనే విడుదలైన "టక్ జగదీశ్" సినిమాతో పెద్ద ఫ్లాపులను సంగతి తెలిసిందే. అయితే నాని ఎట్టకేలకు "శ్యామ్ సింగరాయి" సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. తన అద్భుతమైన నటన తో అందరి దృష్టిని ఆకర్షించిన నాని ప్రస్తుతం "అంటే సుందరానికి" సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో మలయాళం బ్యూటీ నజ్రియ నజిమ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో తెలుగులో అడుగుపెట్టబోతోంది ఈ "రాజా రాణి" బ్యూటీ. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నవీన్ యెర్నేని, వై రవి శంకర్ సంయుక్తంగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం చిత్రబృందం సినిమా షూటింగ్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ కి సంబంధించిన షెడ్యూల్ ఇప్పుడు మాల్దీవ్స్ లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో నాని చిత్ర డైరెక్టర్ మరియు నజ్రియా నజిమ్ తో కలిసి దిగిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. "శ్యామ్ సింగరాయ్" సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమాతో ఇంత వరకు హిట్ అందుకుంటాడో వేచి చూడాల్సిందే. వివేక్ సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Tags:    

Similar News