అంటే సుందరానికి కత్తెర పడబోతోందా?

*అంటే సుందరానికి కత్తెర పడబోతోందా?

Update: 2022-06-11 14:30 GMT

అంటే సుందరానికి కథ ని కట్ చేయనున్నారా?

Ante Sundaraniki Movie: "శ్యామ్ సింగారాయి" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాచురల్ స్టార్ నాని తాజాగా ఇప్పుడు "అంటే సుందరానికి" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది నజ్రియా. జూన్ 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా నిడివి దాదాపు మూడు గంటలు.

మూడు గంటలు అంటే చాలా పెద్ద ప్రయాణం అనే చెప్పాలి. ఎంత పెద్ద స్టార్ అయినా కూడా మూడు గంటల సేపు ప్రేక్షకులను థియేటర్లో కట్టి పడేయటం అంత సులువైన విషయం కాదు. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం లో చాలానే డిస్కషన్లు కూడా జరిగాయట. కొంచెం అయినా ఎడిట్ చేస్తే బాగుంటుందని కొందరు అంటే అలా చేస్తే ఎమోషన్స్ తగ్గిపోతాయని మరికొందరు వాదించారు కానీ చివరకు సినిమాకి కత్తెరలు వేయకుండా మూడు గంటల పాటు ఉండేలాగా విడుదల చేశారు.

అయితే రన్ టైం కూడా ఎక్కువగా ఉందని సినిమా టైం కొంచెం తగ్గించి ఉంటే బాగుండేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు. కనీసం 20 నిమిషాలు అయినా సినిమా కథ ను కట్ చేయొచ్చని అలా చేసి ఉంటే ఇంకా బాగుండేది అని కొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా కొంచెం తగ్గించి విడుదల చేస్తే బాగుంటుందని దర్శకనిర్మాతలు ఈ విషయం గురించి ఆలోచనలో పడ్డారట.

Tags:    

Similar News