వివాదంలో 'వారసుడు'.. దిల్ రాజుకు నోటీసులు..

Vaarasudu: విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "వారసుడు".

Update: 2022-11-24 12:12 GMT

వివాదంలో ‘వారసుడు’.. దిల్ రాజుకు నోటీసులు..

Vaarasudu: విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "వారసుడు". "వారీసు" అనే టైటిల్ తో తమిళ్లో విడుదల కాబోతున్న ఈ బైలింగ్వల్ సినిమా విజయ్ కెరియర్ లో మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమాగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని స్వయంగా నిర్మించారు. అయితే గత కొంతకాలంగా ఈ సినిమాపై వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.

తాజాగా యానిమల్ వెల్ఫేర్ బోర్డు వారు దిల్ రాజుకి నోటీసులు కూడా పంపించారు. షూటింగ్ పర్మిషన్ లేకుండానే సినిమా కోసం కొన్ని జంతువులను వాడారని బోర్డు దగ్గర పర్మిషన్ తీసుకోకుండానే ఏనుగులతో ఒక సన్నివేశాన్ని షూట్ చేశారని ఆ నోటీసు సారాంశం. ఈ నేపథ్యంలో పెర్ఫార్మింగ్ అనిమల్స్ రిజిస్ట్రేషన్ రూల్స్ 2001 రూల్ 3 ప్రకారం ఏవైనా జంతువులతో షూటింగ్ చేయాలంటే బోర్డు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది.

పైగా ఏనుగులు అంతరించి జంతువుల కేటగిరీలోకి వస్తాయి. దీంతో పర్మిషన్ కూడా లేకుండానే ఏనుగులతో షూటింగ్ చేసేసరికి చిత్ర బృందంపై యానిమల్ వెల్ఫేర్ బోర్డు వారు నోటీసులు జారీ చేశారు. ఇక చిత్ర బృందం దీనిపై ఇంకా స్పందించాల్సి ఉంది. గతంలో జీఎస్టీ పై ఒక సినిమాలో జోకులు వేసినందుకు విజయ్ కి మరియు మోడీ ప్రభుత్వానికి ఏ మాత్రం పడటం లేదు అని వార్తలు వినిపించాయి. తాజాగా ఇప్పుడు విజయ్ సినిమా మరొకసారి రాజకీయంగా వివాదాల్లో ఇరుక్కుంది.

Tags:    

Similar News