Anil Ravipudi: స్టోరీ లైన్ తో తారక్, చెర్రీని బుట్టలో పడేసిన అనిల్

Anil Ravipudi: అనిల్ రావిపుడి మెగా కాంపౌండ్ తోపాటు నందమూరి కాంపౌండ్ మీద కూడా కన్నేశాడు.

Update: 2023-06-22 12:00 GMT

Anil Ravipudi: స్టోరీ లైన్ తో తారక్, చెర్రీని బుట్టలో పడేసిన అనిల్

Anil Ravipudi: అనిల్ రావిపుడి మెగా కాంపౌండ్ తోపాటు నందమూరి కాంపౌండ్ మీద కూడా కన్నేశాడు. ఒక వైపు మెగా హీరోలు, మరో వైపు నందమూరి నటులతో ప్రాజెక్టులు ప్లాన్ చేస్తూ లెక్కే మార్చాడు. బాలయ్య తో మూవీ అయిపోనేలేదు, ఇంతలో ఎన్టీఆర్ కి కథ చెప్పి ఒప్పించేశాడు. ఆతర్వాత రామ్ చరణ్ ని లైన్ లో పెట్టేస్తా అంటున్నాడు. ఆల్ మోస్ట్ ఈ రెండు ప్రాజెక్టులకి ఇద్దరు హీరోల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందట.

అనిల్ రావిపుడి బాలయ్యని భగవంత్ కేసరిగా చూపించబోతున్నాడు. ఈ సినిమా పూర్తి కావొచ్చింది. తర్వాత ఏంటి అంటే బడా స్టార్ తోనే ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందని తెలుస్తోంది. అనిల్ రావిపుడు రెండు పడవల ప్రయాణం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పటాస్ నుంచి రాజా దీ గ్రేట్ వరకు ఒక్కో మెట్టెక్కిన అనిల్ రావిపుడి, ఎఫ్ 2 హిట్ స్వింగ్ లో ఉండగానే సరిలేరు నీకెవ్వరు మూవీ తీశాడు. మహేశ్ బాబుతో కలిసి హిట్ మెట్టెక్కాడు. బడా స్టార్లతో కూడా బ్లాక్ బస్టర్లు పట్టగలనని ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ మీద ఫోకస్ పెంచాడు.

స్టార్ హీరోలతో సినిమా తీస్తే ఆ దర్శకుడి మార్కెట్ తోపాటు స్థాయి పెరుగుతుంది. ఈ విషయంలో అనిల్ రావిపుడి ఒక కన్ను స్టార్ హీరో మీదు, మరో కన్ను ఎఫ్ 3 సీక్వెల్ మీదుందట. ఒకటి మిస్ అయినా, మరోకటి సీక్వెల్ రూపంలో అందుబాటులో ఉంటుంది కాబట్టి, అనిల్ రావిపుడికి గ్యాప్ అనేదే రాదు. ఓవైపు ఎఫ్ 2, ఎఫ్ 3, అంటూ కామెడీ సీక్వెల్స్ ప్లాన్ చేస్తూనే, ప్యార్ లల్ గా బాలయ్య, ఎన్టీఆర్ తో సినిమాలంటున్నాడు. నటసింహంతో మూవీ అయిపోవచ్చింది. తర్వాత ఎన్టీఆర్ కి కథ చెబితే నచ్చిందని తెలుస్తోంది. సంక్రాంతికి ఈ సినిమా పట్టాలెక్కేలా ఉందట. ఆతర్వాత టార్గెట్ ఎవరంటే రామ్ చరణే అంటున్నారు.

ఎన్టీఆర్ మూవీ అవగానే ఎఫ్ 4 ని, ప్లాన్ చేస్తున్న అనిల్ రావిపుడి, ఆగ్యాప్ లో రామ్ చరణ్ కి కథ రాస్తాడట. ఆల్రెడీ స్టోరీలైన్ చరణ్ కి నచ్చడంతో, ఇక పూర్తి కథని సిద్దం చేయటమే ఆలస్యం అంటున్నారు. గేమ్ ఛేంజర్ తర్వాత బుచ్చిబాబు, ప్రశాంత్ నీల్ మూవీలతో చెర్రీ బిజీ కానున్నాడు. ఆతర్వాతే అనిల్ రావిపుడి సినిమా సెట్స్ పైకెళ్ళొచ్చట.

Tags:    

Similar News