Anchor Lasya: తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలైన యాంకర్ లాస్య..!
Anchor Lasya Hospitalised: ఒకప్పుడు ప్రముఖ యాంకర్ గా పేరు తెచ్చుకున్న లాస్య మళ్లీ బిగ్ బాస్ షో తో లైమ్ లైట్ లోకి వచ్చింది.
Anchor Lasya: తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలైన యాంకర్ లాస్య..!
Anchor Lasya Hospitalised: ఒకప్పుడు ప్రముఖ యాంకర్ గా పేరు తెచ్చుకున్న లాస్య మళ్లీ బిగ్ బాస్ షో తో లైమ్ లైట్ లోకి వచ్చింది. యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టి తన భర్తతో కలిసి వీడియోలు పెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తు్ంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోలతో నెట్టింట సందడి చేస్తుంది. అయితే తాజాగా లాస్య హాస్పిటల్ పాలైంది. ఈ విషయాన్ని స్వయంగా లాస్య భర్త మంజునాథ్ తన ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చారు.
లాస్య హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉండగా ఒక వీడియో తీసిన ఆయన 'గెట్ వెల్ సూన్' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో యాంకర్ లాస్యకు అసలు ఏం జరిగింది? ఆమె ఎందుకు ఆస్పత్రిలో చేరింది? అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే లాస్య ఆస్పత్రిలో ఎందుకు చేరిందన్న దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. మరోవైపు ఆమె త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా కామెంట్లు పెడుతున్నారు.