Pushpa Song Release: తగ్గేదేలే... పాటతో వేట మొదలెట్టిన "పుష్ప"

Update: 2021-08-13 05:39 GMT

అల్లు అర్జున్ (ట్విట్టర్ ఫోటో)

Pushpa Movie Song Release: తెలుగు సినిమా ఇండస్ట్రీలో "గంగోత్రి" సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తెలుగు రాష్ట్రాలలో ఆర్యతో ఫీల్ మై లవ్ అంటూ అమ్మాయిల మనసుదోచి.., హ్యాపీగా వరుస సూపర్ హిట్ సినిమాలతో కలెక్షన్స్ లో దేశముదురుగా పరుగు పెడుతూ జులాయిగా ఇద్దరు అమ్మాయిలతోనూ అభిమానులను మెప్పించి ఇండస్ట్రీలో తన నటన, డాన్స్ లోనూ మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరొంది రేసుగుర్రంలా వెండితెరపై ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్స్ ఆఫీసు రికార్డులను బద్దలుకొట్టడానికి తానే సరైనోడుగా త్వరలోనే "పుష్ప" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇక తాజాగా దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్న పుష్ప చిత్రం యొక్క మొదటి సాంగ్ ని శుక్రవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. "దాక్కో దాక్కో మేక పులోచ్చి కోరుకుద్ది పీక" అంటూ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట ఐదు భాషల్లో అయిదుగురు ఫేమస్ సింగర్స్ తో పాడించాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్ ప్రోమో సూపర్ హిట్ అవగా, తాజాగా విడుదలైన ఫుల్ సాంగ్ అల్లు అభిమానులకు పునాకాలు తెప్పిస్తుంది. తన మాస్ లుక్ తో పాటు డాన్స్ తో అల్లు అర్జున్ ఈ పాటలో అదరగోట్టినట్టు తెలుస్తుంది. తాజాగా విడుదలైన "పుష్ప" మొదటి సాంగ్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో షేక్ చేస్తుందంటంలో ఎలాంటి సందేహం లేదు.


Full View


Tags:    

Similar News