Allu Arjun: తాజ్ మహల్ లో అల్లు దంపతుల సందడి

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు అతని భార్య స్నేహ రెడ్డి లవ్లీ ఫిక్స్ మీకోసం

Update: 2021-03-07 05:39 GMT

ఇమేజ్ సోర్స్ : ది హన్స్ ఇండియా


Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్నేహారెడ్డిల వివాహానికి శనివారంతో పదేళ్లు అయ్యింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కొత్త ఫోటోలను అప్ లోడ్ చేస్తూ అభిమానుల మనసులు దోచుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా ఇదే చేసారు. తాజాగా 10వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న అల్లు అర్జున్, స్నేహా ప్రేమకు చిహ్నం అయిన తాజ్ మహల్ దగ్గర సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు దిగిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

2011లో వీరికి వివాహం జరిగింది. ఈ జంటకు అయాన్, అర్హ అనే పిల్లలు ఉన్నారన్న సంగతి తెలిసిందే. వీరి వివాహ వార్షికోత్సవం చిత్రాలను చూసిన వారంతా, మరెన్నో యానివర్సరీలు జరుపుకోవాలని కోరుతూ శుభాభినందనలు చెబుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.






 



 



 


Tags:    

Similar News