AA22 A6: రిలీజ్‌కు ముందే రూ.600 కోట్ల డీల్… అల్లు అర్జున్–అట్లీ రేంజ్ ఇదే!
AA22 A6: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.
AA22 A6: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు నెట్‌ఫ్లిక్స్‌తో 600 కోట్ల రూపాయల డిజిటల్ డీల్ జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. షూటింగ్ ముంబైలో జరుగుతోంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తమిళ్ దర్శకుడు అట్లీ కలయికలో రూపొందుతున్న చిత్రం, పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. అన్ని భాషల డిజిటల్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్‌తో అధునాతన చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ డీల్ 600 కోట్ల రూపాయలకు ఖరారయ్యినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది రికార్డు స్థాయి ఒప్పందంగా నిలుస్తుంది. ఈ వార్త టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. అల్లు అర్జున్ కెరీర్‌లో ఇది మరో మైలురాయిగా మారనుంది.