Mega Princess: కోడలిని చూడటానికి హాస్పిటల్‌కు వచ్చిన అల్లు అర్జున్
Allu Arjun: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులయ్యారు. ఈ జంట ఇవాళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
Mega Princess: కోడలిని చూడటానికి హాస్పిటల్‌కు వచ్చిన అల్లు అర్జున్
Allu Arjun: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులయ్యారు. ఈ జంట ఇవాళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఫ్యామిలీలోకి మెగా ప్రిన్సెస్ రావడంతో చిరంజీవి ఆనందంలో తేలిపోతున్నారు. అపోలో హాస్పటల్ లో ఉపాసన డెలివరీ జరిగింది. ఇక సినిమా సెలబ్రెటీలు కూడా చరణ్ , ఉపాసన దంపతులకు విషెస్ తెలుపుతున్నారు. లిటిల్ మెగా ప్రిన్సెస్‌ను చూసేందుకు మెగా ఫ్యామిలీతో పాటు పలువురు చిరు, రామ్‌చరణ్ సన్నిహితులు తరలివస్తున్నారు. ఉదయమే మనవరాలిని చూసేందుకు చిరంజీవి వచ్చారు. తాజాగా పుష్పరాజ్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డిలు మెగా ప్రిన్సెస్‌ను చూడటానికి హాస్పిటల్‌కు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.