బన్నీ రికార్డు బద్దలు కోట్టేందుకు మరో మెగా హీరో రెడీ

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అల..వైకుంఠపురములో'.

Update: 2020-05-13 07:16 GMT
Allu Arjun From Ala Vaikunthapurramuloo

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అల..వైకుంఠపురములో'. సంక్రాంతి కనుకగా వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. వసూళ్ళ పరంగా ఈ చిత్రం సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు.. అంతేకాకుండా బన్నీ కెరీర్‌లోనే మ్యూజికల్ హిట్ చిత్రంగా నిలిచింది.

తమన్ అందించిన స్వరాలు ఈ చిత్రంలోని పాటలు సినిమా విడుదల కంటే ముందే రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీలోని 'రాములో రాములా' వీడియో సాంగ్‌ యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుని దూసుకెళ్తోంది. కాసర్ల శ్యామ్‌ రచించిన ఆ పాటను అనురాగ్‌ కులకర్ణి, మంగ్లీ అలపించారు.


మరోవైపు సాయిధరమ్‌ తేజ్‌ సోదరుడిగా వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా 'ఉప్పెన' సినిమాతో వెండితెరకు పరిచయం కానున్నారు. కృతీశెట్టి కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ స్వరాలు అందిస్తున్నారు.

'నీ కన్ను నీలి సముద్రం' అనే ఆడియో సాంగ్‌ ఇప్పటివరకూ యూట్యూబ్‌లో 50 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుని ప్రేక్షకులను అలరిస్తుంది. ఏప్రిల్‌ 2న 'ఉప్పెన' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించినప్పటికీ.. కరోనా వ్యాప్తి డౌన్ ప్రభావం వల్ల సినిమా వాయిదా పడింది.




Tags:    

Similar News