Siddharth and Aditi: సీక్రెట్‌గా టాలీవుడ్ హీరో సిద్ధార్థ్, అదితీరావు హైదరీ పెళ్లి?
Siddharth and Aditi: సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోన్న వివాహం వార్తలు
Siddharth and Aditi: సీక్రెట్‌గా టాలీవుడ్ హీరో సిద్ధార్థ్, అదితీరావు హైదరీ పెళ్లి?
Siddharth and Aditi: టాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్ధార్థ్ సీక్రెట్‌గా మళ్లీ మ్యారేజ్ చేసుకున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వివాహం ఎక్కడో సిటీలో కాదు సాదాసీదా పల్లెటూరిలోని ఓ టెంపుల్‌లో జరిగిందనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. కొన్నిరోజులుగా ప్రేమలో ఉన్న సిద్ధార్థ్, అదితీ రావు హైదరి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారనే న్యూస్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలంలోని శ్రీరంగనాథుని ఆలయంలో సిద్ధార్థ్, అదితీ రావు హైదరీలు పెళ్లి చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో అదితీ రావు హైదరీ ఒకరుగా ప్రచారంలో ఉంది. అయితే మూవీ షూటింగ్ కోసం వచ్చినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నా.. కొందరు మాత్రం ఆ విషయాన్ని ఖండిస్తున్నారు. రాత్రికి రాత్రే పెళ్లి కోసం శ్రీరంగనాథుని ఆలయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. తెల్లవారుజామున వివాహ తంతును ఆలయ అర్చకులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. పెళ్లి పూర్తయ్యే వరకు ఆలయం లోపలికి ఎవరినీ అనుమతించలేదని సమాచారం. వివాహం పూర్తయిన తర్వాత చాలా సీక్రెట్‌గా సిద్ధార్థ్, అదితీ రావు హైదరీ అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది.